రెపో రేటు పెరిగింది, మీ ఇంటి రుణం మీద EMI ఎంత పెరుగుతుందో తెలుసా?

[ad_1]

Home Loan EMI: రెపో రేటును మళ్లీ పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం వివరాలను వెల్లడించిన రిజర్వ్‌ బ్యాంక్‌, రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు లేదా 0.35 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. 

దీని కంటే ముందు, 2022లోనే రెపో రేటును RBI నాలుగు సార్లు పెంచింది. ఈ ఏడాది మే నెలలో మొదటి సారి 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్లో 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ 8 నెలల్లోనే (మే నుంచి డిసెంబర్‌ వరకు) మొత్తంగా 190 బేసిస్‌ పాయింట్లు లేదా 1.90 శాతం మేర రెపో రేటును RBI పెంచింది. 4 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. దీంతో, RBI పాలసీ రేటు 2018 ఆగస్టు నాటి గరిష్ట స్థాయి 6.25 శాతానికి చేరుకుంది. 

గృహ రుణాల మీద RBI రెపో రేటు పెంపు ప్రభావం
RBI నిర్ణయం తర్వాత, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇప్పటికే ఇచ్చిన, ఇకపై ఇవ్వబోయే గృహ రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. ఈ పెంపు దాదాపుగా కొత్త సంవత్సరం, అంటే 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ లెక్కన, నూతన సంవత్సరం నుంచి మీ EMI మరింత ఖరీదుగా మారుతుంది. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ల మీద ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లలో 0.35 శాతం పెరుగుదల ఉంటుంది. మీ EMI ఎంత పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

రూ. 20 లక్షల గృహ రుణంపై EMI ఎంత పెరుగుతుంది?
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి 8.40 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి మీరు రూ. 25 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. దాని మీద రూ. 21,538 EMI చెల్లించాలని అనుకుందాం. రెపో రేటులో 35 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత, వడ్డీ రేటు 8.75 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా చెల్లించాల్సిన EMI రూ. 22,093 అవుతుంది. అంటే మీ EMI మొత్తం మరో రూ. 555 పెరుగుతుంది. మీరు సంవత్సరం మొత్తంలో అదనంగా రూ. 6,660 చెల్లించాల్సి ఉంటుంది.

News Reels

రూ. 40 లక్షల గృహ రుణంపై EMI ఎంత పెరుగుతుంది?
మీరు 20 సంవత్సరాల కాలానికి రూ. 40 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే, దాని మీద మీరు ప్రస్తుతం 8.40 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్లయితే, ప్రస్తుతం మీరు రూ. 34,460 EMI చెల్లించాలి. రెపో రేటును పెంచిన తర్వాత, ఇప్పుడు మీరు 8.75 శాతం వడ్డీని చెల్లించాలి. అంటే రూ. 35,348 EMI చెల్లించాలి. ప్రతి నెలా అదనంగా రూ. 888, ఒక సంవత్సరంలో రూ. 10,656 మేర మీ జేబు మీద భారం పెరగబోతోంది.

రూ. 50 లక్షల గృహ రుణంపై EMI ఎంత పెరుగుతుంది?
మీరు 15 ఏళ్ల కాలానికి రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే, ప్రస్తుతం 8.40 శాతం వడ్డీ రేటుతో రూ. 48,944 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. RBI రెపో రేటును పెంపు తర్వాత, వడ్డీ రేటు 8.70 శాతానికి పెరుగుతుంది, దాని మీద రూ. 49,972 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల అదనంగా రూ. 1028, ఒక సంవత్సరంలో అదనంగా రూ. 12,336 EMI చెల్లించాల్సి ఉంటుంది.

EMI భారం నుంచి ఉపశమనం పొందవచ్చు
వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఇక్కడితో ఆగిపోవచ్చని భావిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తీసుకు రావాలన్నది RBI లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే, రాబోయే నెలల్లో రెపో రేటు తగ్గవచ్చు, ఫలితంగా EMIలో తగ్గింపు ఉండవచ్చు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *