రేటు పెంచి షాకిచ్చిన గ్యాస్‌ కంపెనీలు, సిలిండర్‌కు ఎంత పెరిగిందంటే?

[ad_1]

Commercial LPG Cylinder Price Hike: ప్రతి నెల 1వ తేదీన గ్యాస్‌ ధరలు సవరించే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు), ఈసారి 3 రోజులు ఆగి షాక్‌ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్‌ సిలిండర్ రేటును రూ. 7 చొప్పున పెంచాయి. ఈ రేట్‌ హైక్‌ జులై 1 నుంచే అమల్లోకి వచ్చింది. 

ఇప్పుడు, దేశ రాజకీయ రాజధాని దిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర (19 Kg LPG Cylinder Price) రూ. 1,773 నుంచి రూ. 1,780కి పెరిగింది. దేశ రాజకీయ రాజధాని ముంబైలో రూ. 1,725 నుంచి రూ. 1733.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1,875.50 నుంచి రూ.1895.50కి. చెన్నైలో వాణిజ్య LPG సిలిండర్‌ రేటు రూ. 1937 నుంచి రూ. 1945కి మారింది. 

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో, 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ రేటు 1769 రూపాయలు దగ్గరుంది. మార్చి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటును ఒక్కసారే రూ.350.50 మేర OMCలు పెంచాయి, ఆ నెలలో ఒక్కో గ్యాస్‌ బండ రికార్డ్‌ స్థాయిలో రూ. 2119.50 పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 91.5 తగ్గి రూ. 2028కి చేరుకుంది. మే, జూన్‌ నెలల్లో కలిపి కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ రేటును రూ.255.50 మేర OMCలు తగ్గించాయి, రూ. 1,773కి చేర్చాయి. ఈ నెలలో 7 రూపాయలు చొప్పున పెంచాయి.

డొమెస్టిక్‌ LPG ధర పరిస్థితేంటి?
సామాన్యులు ఇళ్లలో వంట కోసం ఉపయోగించే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో (Domestic LPG Cylinder Price) మార్పు లేదు. ఈ ఏడాది మార్చి నెలలో రూ. 50 పెంచిన ఓఎంసీలు, ఆ తర్వాత ఇక తగ్గించలేదు. 

ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ (రెడ్‌ సిలిండర్‌) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెహ్‌లో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది. 

దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ రేట్లు ఒక్కోలా ఉంటాయి. 

LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్‌ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-productsను చూడవచ్చు. LPG కాకుండా ఇతర విషయాల్లోనూ అప్‌డేట్స్‌ పొందవచ్చు.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఇవాళ్టి రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *