రైళ్లలో భోజనం ఆర్డర్ చేయడం ఇకపై మరింత సులువు..

[ad_1]

మరిన్ని రైళ్లలో..

మరిన్ని రైళ్లలో..

రైలు ప్రయాణీకులు వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం త్వరలోనే కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వాట్సప్ నంబర్ +91 8750001323 ద్వారా కొన్ని రూట్లలో భోజనం డెలివరీ చేస్తోంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in తో పాటు IRCTC యాప్ ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా ఇ-కేటరింగ్ సేవలను అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ఇతర రైళ్లకూ విస్తరించాలని యోచిస్తోంది.

మరింత మందికి సేవలు:

మరింత మందికి సేవలు:

“ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణీకులకు ఈ-కేటరింగ్ సేవలు అందించేందుకు.. వాట్సాప్ కమ్యూనికేషన్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్, సూచనల ఆధారంగా మరిన్ని రైళ్లలో వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సేవలను IRCTC ప్రారంభిస్తుంది” అని సోమవారం ఒక ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం రోజుకు సుమారు 50 వేల మందికి ఇ-కేటరింగ్ విధానంలో భోజనం అందిస్తుండగా.. వాట్సాప్ వినియోగం వల్ల ఈ సంఖ్య మరింత పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

యాప్ అవసరం లేకుండానే:

యాప్ అవసరం లేకుండానే:

వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భావించారు. అయితే మొదటి దశలో www.ecatering.irctc.co.inపై క్లిక్ చేయడం ద్వారా ఇ-కేటరింగ్ సేవలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇ-టికెట్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లకు బిజినెస్ వాట్సాప్ నంబర్ ద్వారా సందేశం వెళుతుంది. ఈ పద్ధతి ఇప్పటికే పలు రైళ్లలో అమలవుతుతోంది. యాప్‌ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా IRCTC ఇ-కేటరింగ్ వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న, నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన భోజనాన్ని బుక్ చేసుకోగలుగుతున్నారు.

AI సాయంతో..

AI సాయంతో..

ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్ మరియు డెలివరీ అనేది రెండవ దశ. ఈ విధానంలో ప్రయాణీకుల నుంచి ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ను ప్లాట్‌ ఫారమ్‌గా ఉపయోగిస్తారు. ఇందులో ఇ-కేటరింగ్ సేవలకు సంబంధించిన అన్ని ప్రశ్నలనూ AI ఆధారిత చాట్‌బాట్ నిర్వహిస్తుండటంతో పాటు వారికి భోజనాన్ని సైతం బుక్ చేస్తుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *