[ad_1]
హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది..
సొరకాయ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే.. హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుందని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్ అన్నారు. సొరకాయలో ఉండే.. పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు.. పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది..
సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది తాగితే.. శరీరం నుంచి విష పదార్థాలు తొలగుతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి..
సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. దీనిని అల్సర్, జ్వరం, నొప్పులను, శ్వాసకోసం సమస్య చికిత్సలో ఉపయోగిస్తారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
బరువు తగ్గుతారు..
ఈ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది.
అందానికీ మేలు చేస్తుంది..
సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. సొరకాయ జ్యూస్ తరచూ తీసుకుటే.. తెల జుట్టు, ముడతల సమస్య దూరం అవుతాయి. ఈ రసాన్ని తలకు అప్లై చేస్తే.. జుట్టు రాలడం, నెరవడం సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఎలా తయారు చేసుకోవాలి..
ఇవి తీసుకోండి..
- సొరకాయ – మీడియం సైజ్
- పుదీనా ఆకులు – పది
- అల్లం – అరంగుళం ముక్క
- నిమ్మకాయ – ఒకటి
- బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా
సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్‌లో వేయాలి. దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి తాగండి.
వీళ్లు తాగకూడదు..
మీరు కడుపు, పేగులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుంటే.. పచ్చి సొరకాయ జ్యూస్ తాగకూడదు. మీరు ముందుగా సొరకాయను ఉడకబెట్టి జ్యూస్ చేసుకోవడం మంచిది. కొంతమందికి పచ్చి సొరకాయ జీర్ణకావడం కష్టం అవుతుంది. దీని దృష్టిలో ఉంచుకుని సొరకాయ ఉడకబెట్టడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply