[ad_1]
Best Multibagger Stock 2023: భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, ఎకానమీ ఇంజిన్‌ను డబుల్ స్పీడ్‌తో నడపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో రోడ్లు, వంతెనలు కొత్త నిర్మాణాలు, ఇప్పటికే ఉన్నవాటిని అప్‌గ్రేడ్ చేయడం వంటి వాటికి వేల కోట్ల రూపాయల నిధులు కుమ్మరిస్తోంది. దీనివల్ల, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌లోని కంపెనీల పంట పడుతోంది. ఆ కంపెనీల షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు కూడా ఆ పంట నుంచి వాటా వస్తోంది. గత కొన్ని నెలలుగా, కొన్ని కన్‌స్ట్రక్షన్ కంపెనీ స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి.
దలాల్ స్ట్రీట్‌లో లాభాలు పోగేసుకుంటున్న నిర్మాణ కంపెనీల్లో ‘హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్’ (Hindustan Construction Company Ltd) ఒకటి. ఈ కంపెనీ షేర్లు నిలకడగా మంచి పనితీరు కనబరుస్తున్నాయి, పెట్టుబడిదార్లకు అద్భుతమైన రాబడి ఇస్తున్నాయి. నిన్న (శుక్రవారం, 11 ఆగస్టు 2023) కూడా ఈ కంపెనీ షేర్లు 5.33 శాతం పెరిగి రూ. 24.70 స్థాయికి చేరాయి. దీని 52-వారాల రికార్డ్ స్థాయి రూ. 26.45కు సమీపంలో ఉన్నాయి.
ఈ వారంలో 20 శాతం ర్యాలీ
గత 5 రోజుల్లోనే (సోమవారం-శుక్రవారం) ఈ షేరు ధర 20 శాతానికి పైగా పెరిగింది. గత నెల రోజుల్లో 21 శాతం కంటే ఎక్కువే ర్యాలీ చేసింది. గత 6 నెలల కాలంలో ఇన్వెస్టర్లకు 68 శాతం రిటర్న్స్ ఇచ్చింది. గత ఒక ఏడాది కాలంలో 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది, రెట్టింపు పైగా పెరిగింది.
₹లక్షకు ₹రెండు లక్షలు
ఏడాది క్రితం, అంటే ఆగస్టు 12, 2022న, హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేరు ధర కేవలం రూ. 12.40. ఇప్పుడు రూ. 24.70 కి చేరుకుంది. ఇది 100.81 శాతం గ్రోత్. ఈ ప్రకారం, ఈ స్టాక్ కేవలం ఒక సంవత్సరంలోనే తన పెట్టుబడిదార్ల డబ్బును రెట్టింపు చేసింది. గత ఏడాది ఆగస్టు 12న ఈ స్టాక్‌లో ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పటికి ఆ డబ్బు రూ. 2 లక్షలుగా మారేది.
కంపెనీ చేతిలో పెద్ద ప్రాజెక్టులు
హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 3,740 కోట్లు. ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఈ కంపెనీ కూడా పని చేస్తోంది. ప్రస్తుతం, కంపెనీ పోర్ట్‌ఫోలియోలో జమ్ముకశ్మీర్‌లోని రాంవాన్ బనిహాల్ రోడ్ ప్రాజెక్టు, ముంబైలోని కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, NH-34లో బహరంపూర్-ఫరక్కా హైవే ప్రాజెక్టు, పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా-రాయ్‌గంజ్ హైవే ప్రాజెక్టు, మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలోని ధూలే హైవే ప్రాజెక్టు ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: నష్ట జాతకం ఒకప్పుడు, ఇప్పుడవి పట్టిందల్లా బంగారమే, ఫేట్ మార్చిన న్యూ-ఏజ్ స్టాక్స్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.3
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply