వర్కౌట్ చేసినప్పుడు ఈ లక్షణాలు ఉంటే గుండె సమస్య ఉన్నట్లేనట..

[ad_1]

వర్కౌట్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడం ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కార్డియాక్ అరెస్ట్‌ వచ్చినప్పుడు ఓ వ్యక్తి మెదడు రక్త సరఫరా ఆగిపోతుంది. అలాంటప్పుడు వ్యక్తికి ట్రీట్‌మెంట్ అవసరం. కార్డియాక్ అరెస్ట్‌కి ముందు శరీరంలో చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటన్నింటినీ మందుగానే తెలుసుకుంటే, మీరు ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అందుకే, అవేంటో తెలుసుకోండి.

​విపరీతమైన అలసట..

​విపరీతమైన అలసట..

వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువగా అలసట అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను నిరోధించడానికి పనిచేస్తుంది. ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. మీకు అలసటగా అనిపిస్తుంది. కాబట్టి, ఇది కూడా ఓ లక్షణమే.

గుండె ఆరోగ్యానికి చిట్కాలు..

ఈ సింపుల్ చిట్కాలతో హృదయం పదిలం .. గుండె జబ్బులు దూరం

​గుండె వేగంగా కొట్టుకోవడం..

​గుండె వేగంగా కొట్టుకోవడం..

చాలా సార్లు వర్కౌట్ చేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. వర్కౌట్ చేసినప్పుడు ఛాతీ నొప్పి, అసౌకర్యంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకోండి. హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కొద్ది పాటి వర్కౌట్ చేయండి.

​శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

​శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

కొన్నిసార్లు వర్కౌట్ చేసేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. ఈ లక్షణాలు మీ హార్ట్ ఫెయిల్యూర్, గుండె సమస్యల్ని సూచిస్తాయి. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వర్కౌట్ చేయడం కాసేపు ఆపండి.

​ఛాతి నొప్పి..

​ఛాతి నొప్పి..

ఇక గుండె పోటు వచ్చే ముందు ఛాతి నొప్పిగా ఉంటుంది. వర్కౌట్ చేసేటప్పుడు పదే పదే నొప్పి వస్తుంటే దానిని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది ఓ లక్షణంగా భావించాలి.
Also Read : Salad side effects : బరువు తగ్గాలని సలాడ్ తింటున్నారా..

​డీహైడ్రేషన్..

​డీహైడ్రేషన్..

జిమ్‌లో వర్కౌట్ చేసేటప్పుడు డీహైడ్రేషన్ పెరగడం సమస్య వస్తుంది. ఆ సమయంలో ద్రవాలు కోల్పోవడం, పొటాషియం, సోడియం, ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గిపోతాయి. దీంతో హృదయ స్పందనకి ఇబ్బంది అవుతుంది.
Also Read : Diet for Period : పీరియడ్స్ టైమ్‌లో ఈ 5 తింటే కడుపునొప్పి, తిమ్మిర్లు దూరం..

​తలతిరగడం..

​తలతిరగడం..

కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఓ వ్యక్తికి కళ్ళు తిరగడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా అనిపిస్తే మీరు వర్కౌట్‌ని కాస్తా పక్కన పెట్టాలి.
​​​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​Read More : Health News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *