[ad_1]
Kalyan Jewellers Shares: పేరుకు తగ్గట్లే బంగారం లాంటి స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఇవాళ్టి (సోమవారం, 05 డిసెంబర్ 2022) వీక్ మార్కెట్‌లోనూ ఇది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇంట్రా డే ట్రేడ్‌లో భారీ వాల్యూమ్స్ కనిపించాయి. NSE, BSEలో కలిపి 6.83 మిలియన్ షేర్లు చేతులు మారాయి. BSEలో, ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి కొత్త గరిష్ట స్థాయి రూ. 116.35 కి (ఉదయం 11.15 గం. సమయానికి) చేరుకుంది.
ఆరు నెలల్లో డబుల్
బలమైన ఆదాయాల అంచనాతో, గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే స్టాక్ 18 శాతం పెరిగింది. 2021 మార్చి 26న ఈ స్క్రిప్ దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేసింది. ప్రస్తుతం జీవితకాల గరిష్టంలో ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది మే 11న రూ. 55.20 వద్ద రికార్డు స్థాయి కనిష్టాన్ని తాకింది. అక్కడ్నుంచి లెక్కేస్తే, ఈ ఆరు నెలల్లో ఇప్పటి వరకు రెట్టింపు పైగా (111 శాతం) పెరిగింది.
ఈ షేరు ఇష్యూ ధర రూ. 87. దీనితో పోలిస్తే, ప్రస్తుతం ఒక్కో షేరు 34 శాతం ఎక్కువ రేటు పలుకుతోంది.
News Reels
ఇండెక్స్ ఔట్‌పెర్ఫార్మర్
గత ఆరు నెలల కాలంలో, కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ ధర 90 శాతం పెరిగింది. ఇదే కాలంలో BSE సెన్సెక్స్ 12 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ ధర 70 శాతం పెరిగితే, BSE సెన్సెక్స్ 6 శాతం పెరిగింది.
జులై, ఆగస్టు నెలల్లో శుభ ముహూర్తాలు లేకపోవడంతో బంగారం వ్యాపారం పెద్దగా సాగలేదు. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY23) పండుగల సీజన్ + పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. కాబట్టి, Q3లో ఈ కంపెనీ మంచి ఆదాయాలు సంపాదిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. ఆ కారణంగానే కొన్నాళ్ల నుంచి ఈ కంపెనీ షేర్లను కొంటున్నారు.
జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23), కంపెనీ ఏకీకృత ఆదాయంలో 20 శాతం వార్షిక వృద్ధితో (YoY) రూ. 3,473 కోట్లకు చేరుకుంది. ఏకీకృత పన్ను తర్వాతి లాభం 53.6 శాతం పెరిగి రూ. 106 కోట్లకు చేరుకుంది. అయితే.. ఆ త్రైమాసికంలో వ్యయాలు పెరగడంతో ఎబిటా (EBITDA) మార్జిన్ YoYలో 24 బేసిస్ పాయింట్లు, QoQలో 27 బేసిస్ పాయింట్లు తగ్గి 7.7 శాతంగా నమోదైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply