ఇన్ఫెక్షన్..
NIH ప్రకారం, పక్కటెముకల ఎముకలు, వెన్నెముక, ఎముకల కణజాలాలలో ఇన్ఫెక్షన్ల కారణంగా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆస్టియోమైలిటిస్, ఎపిడ్యూరల్ అబ్సెస్, డిస్క్ స్పేస్ ఇన్ఫెక్షన్ వల్ల వెన్నునొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వెన్నెముక క్యాన్సర్..
వెన్నుముకలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు వెన్నుముక క్యాన్సర్ వస్తుంది. వెన్నెముక క్యాన్సర్ జన్యుపరమైన కారణాల వల్ల కూడా రావచ్చు. క్యాన్సర్ కణజాలం కాలు ఎముకలు, తుంటి ఎముక, వెన్నుముకకు కూడా వ్యాపిస్తుంది. ఈ క్యాన్సర్ ఉంటే.. తరచు వెన్నునొప్పి రావడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హెర్నియేటెడ్ డిస్క్..
హెర్నియేటెడ్ డిస్క్ దీన్ని స్లిప్డ్ డిస్క్ అని కూడా అంటారు. ఇది మీ వెన్నెముక డిస్క్ జారినప్పుడు.. ఈ పరిస్థితి వస్తుంది. దీని కారణంగా వెన్ను, వెన్నెముక ఎముకలలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
ఆస్టియోపోరసిస్..
ఆస్టియోపోరోసిస్.. ఎముకలకు సంబంధించిన వ్యాధి. ఎముకలు గుల్లబారటం. ఎముకల చేవ తగ్గిపోయి, దృఢత్వం కోల్పోయి.. బోలుబోలుగా బలహీనంగా అయిపోవటం. దీనికి మూలం ఎముక కణజాలం సాంద్రత తగ్గుముఖం పడుతుంది. వెన్నునొప్పి.. ఆస్టియోపోరసిస్‌కు సాధారణ లక్షణం. దీనితో పాటు.. మోకాలు, తుంటి భాగాలలోనూ.. నొప్పిగా ఉంటుంది.
సయాటికా..
నడుంనొప్పితో నడుస్తున్నపుడు భరించలేనంత బాధ ఉంటుంది. కాలి పిక్కల నుంచి నొప్పి వెన్నులోకి పాకుతుంది. ఈ సమస్యను సయాటికా నొప్పి అంటారు. సయాటికాలో వెన్ను, కాళ్లలో నొప్పి, జలదరింపు, తిమ్మిరి ఉంటుంది.
యాంకైలోజింగ్ స్పాండిలైటిస్..
యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ముందు నడుంనొప్పితో మొదలవుతుంది. మూడు నెలలైనా నడుం నొప్పి విడవకుండా వేధిస్తుంటే దీన్ని అనుమానించాలి. ప్రత్యేకించి ఉదయం పూట నొప్పి ఉండటం, అదీ 45 నిమిషాల వరకైనా నొప్పి తగ్గకపోటం, అలాగే అర్ధరాత్రీ నొప్పి వస్తుంది.
స్పైనల్ స్టెనోసిస్..
స్పైనల్ స్టెనోసిస్ అనేది వెన్నెముక కాలువ సంకుచితం, దీని వలన నరాల కుదింపు. ఇది తిమ్మిరికి దారితీస్తుంది, వీపు కింది భాగంలో నొప్పి ఉంటుంది. మీ చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు, బలహీనంగా ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Leave a Reply