[ad_1]
పసుపు..
పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో పసుపును వినియోగిస్తారు. కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పసుపు కీళ్లనొప్పులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యల్లో వాపును తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. మీరూ తీసుకునే ఆహారం, పానీయాలలో పసుపు తీసుకుంటే మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అల్లం..
అల్లం అద్భుతమైన హెర్బ్. అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో నొప్పి, వాపు, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అల్లంలోని ఔషధ గుణాలు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి, పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది. వేసవికాలంలో మీ ఆహారంలో మసాలాగా అల్లాన్ని తీసుకుంటే మంచిది. అల్లం టీ తాగినా మంచిదే.
దాల్చిన చెక్క..
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని ఓట్ మీల్, స్మూతీస్, వంటల్లో మసాలాగా దాల్చిన చెక్కను తీసుకోండి.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వెల్లుల్లి మీ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని వంటల్లో వేసుకుని తీసుకోవచ్చు, పచ్చిగా తిన్నా మంచిదే.
(Image source – pexels)
రోజ్మేరీ..
రోజ్మేరీని మెడిటరేనియన్ వంటకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రోజ్మేరీలో రోస్మరినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, జీర్ణక్రియను ప్రోత్సహిస్తోంది.
Also Read:Diabetes control: ఈ మొక్క ఆకులతో.. షుగర్‌కు చెక్ పెట్టవచ్చు..!
తులసి (Basil)..
తులసిలో ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇందులో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. తులసి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. . దీనిని సలాడ్‌లలో మసాలాగా, పాస్తాలో వేసుకుని తినొచ్చు. ఉదయం పూట నాలుగు ఆకులు తిన్నా మంచిదే.
Also Read:Thyroid Diet: ఈ ఫుడ్స్ తింటే.. థైరాయిడ్ నార్మల్ అవుతుంది..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply