వేసవిలో ఈ జ్యూస్‌ తాగితే ఒంట్లో వేడి పోయి.. రీఫ్రెష్‌ అవుతుంది..!

[ad_1]

Stone Apple: ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ మారేడు వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మారేడు పండ్లు, కాయలు, బెరడు, ఆకులు, పువ్వులు ఇలా అన్నీ ఔషధాల్లో ఉపయోగపడేవే. వేసవి కాలంలో మనం మారేడు కాయల గురించి ప్రత్యేకకంగా చెప్పుకోవాలి. మారేడు కాయను ఇండియన్‌ క్విన్స్‌, గోల్డెన్‌ యాపిల్‌, స్టోన్‌ యాపిల్‌, వుడ్‌ యాపిల్‌ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను జామ్స్‌, జెల్లీలు, శీతలపానీయాలు, జ్యూస్‌, షర్బత్‌ తయారు చేసుకుంటూ ఉంటారు. వేసవికాలంలో మారేడు పండ్లు తినడం, జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అబ్రార్ ముల్తానీ మనకు వివరించారు.

ఈ పోషకాలు ఉంటాయి..

ఈ పోషకాలు ఉంటాయి..

మారేడు పండు పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రొటీన్లు, ఫైబర్‌, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ విటమిన్‌ ఏ, సి, బి1, బి2 వంటి పోషకాలు ఉంటాయి. (image source – pixabay)

బెస్ట్‌ సమ్మర్‌ డ్రింక్‌..

బెస్ట్‌ సమ్మర్‌ డ్రింక్‌..

మారేడు జ్యూస్‌ సమ్మర్‌ బెస్ట్‌ డ్రింక్‌ అని డాక్టర్‌ అబ్రార్‌ అన్నారు. ఇది శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్‌నెస్‌ ఇస్తుంది. వేసవిలో ఈ పండు రసం తాగితే చాలా మంచిది. ఈ జ్యూస్‌ తాగితే.. ఒంట్లో వేడి పోవడంతో పాటు తక్షణశక్తి వస్తుంది. ఇది ఎండ వాతావరణానికి టానిక్‌గా పని చేస్తుంది.

Also Read:Potassium Deficiency: ఈ పోషకం లోపిస్తే.. బీపీ పెరుగుతుంది..!

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

మా రేడు పండ్ల రసం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మారేడు పండులోని కాల్షియం ఎముకలు, దంతాలు బలంగా ఉండేలా తోడ్పడుతుంది. మారేడు పండ్ల రసం తక్షణ శక్తిని ఇస్తుంది. (image source – pixabay)

రక్తహీనత దూరం అవుతుంది..

రక్తహీనత దూరం అవుతుంది..

మారేడు పండ్ల రసంలో విటమిన్‌ B2 ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. రోజూ మారేడు పండ్ల జ్యూస్‌ తాగితే రక్తలేమి దూరం అవుతుంది. (image source – pixabay)

Also Read:Chickpeas for diabetics: షుగర్‌ పేషెంట్స్‌ శనగలు తింటే.. మంచిదేనా..?

జ్యూస్‌ ఇలా తయారు చేసుకోండి..

జ్యూస్‌ ఇలా తయారు చేసుకోండి..

పండిన మారేడు – ఒకటి, బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా.
ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి. ఈ గుజ్జును మిక్సీ జార్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి బ్లెండ్‌ చేయండి. దీన్ని వడపోసి సరిపడా బెల్లం వేసుకోవాలి. చివరిగా దీనిలో దాల్చిన చెక్క, జాజికాయ పొడివేసుకుని జ్యూస్‌ ఎంజాయ్‌ చేయండి.
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *