వేసవిలో ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

[ad_1]

వేసవిలో నిద్రకు ఎందుకు ఆటంకం కలుగుతుంది..

వేసవిలో నిద్రకు ఎందుకు ఆటంకం కలుగుతుంది..

మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా స్లీప్ హార్మోన్, మెలటోనిన్ అసౌకర్యానికి గురిచేస్తాయి. మెలటోనిన్ మీ నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది, మనం మేల్కొన సమయం కూడా అదే చెబుతుంది. రాత్రులు చల్లగా ఉండటం వల్ల, మీరు సౌకర్యవంతంగా నిద్రపోతారు. శీతాకాలం ఎక్కువ నిద్రపోవడానికి ఇదే కారణం.​

Psoriasis: వేసవిలో సోరియాసిస్‌ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

గదిని చల్లగా ఉంచండి..

గదిని చల్లగా ఉంచండి..

వేసవిలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. మీరు ఉదయం పూట.. కిటికీలు, బ్లైండ్‌లు, కర్టెన్‌లను మూసి ఉంచండి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ1 ప్రకారం, ఇన్సులేటెడ్ సెల్యులార్ షేడ్స్ కిటికీల ద్వారా వచ్చే సౌర వేడిని 60 శాతం వరకు తగ్గిస్తుంది. దీంతో మీ గది చల్లగా ఉంటుంది. (image source – pixabay)

Thyroid Issues: థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!

నిద్రవేళకు ముందు వ్యాయామం, ఎక్కువగా తినడం మానుకోండి..

నిద్రవేళకు ముందు వ్యాయామం, ఎక్కువగా తినడం మానుకోండి..

వేసవిలో రాత్రిపూట ఎక్కువగా తినడం, సాయంత్రం పూట తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. వీటి కారణంగా నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉంది. అలాగే, ఆల్కహాల్ మితంగా తీసుకుంటే మంచిది.

(image source – pixabay)

నిద్రపోయే ముందు స్నానం చేయండి..

నిద్రపోయే ముందు స్నానం చేయండి..

నిద్రపోయే ఒక గంట లేదా రెండు గంటల ముందు స్నానం చేస్తే మీ శరీరం చల్లబడుతుంది. దీంతో మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. (image source – pixabay)

నేలపై నిద్రపోండి..

నేలపై నిద్రపోండి..

పరుపులు మీద పడుకుంటే.. శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు పరుపుల మీద కాకుండా.. నేల మీద పడుకుంటే.. మీ నిద్రకు ఆటంకం కలగదు. ఒకవేళ నేల మీద పడుకోవడం అలవాటు లేకపోతే.. స్ర్పింగ్‌ పరుపులు వేసుకోండి.

Cow Milk Health Benefits: ఆవు పాలు తాగితే.. బరువు తగ్గుతారా..?

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *