[ad_1]
మొదటి రెండు రాష్ట్రాలివే:
2005-06 నుంచి 2021-22 మధ్య తెలంగాణ సాధించిన స్థిర అభివృద్ధిని కొనియాడుతూ ఓ నివేదిక విడుదలైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుని పరిశీలించిన వ్యవసాయ ఆర్థికవేత్తలు దీనిని ప్రచురించారు. సగటున 8.6 శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(GSDP)తో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని అందులో ప్రకటించారు. యావరేజ్ GSDP 8.9 శాతంతో గుజరాత్ అగ్రస్థానంలో, 8.7 శాతంతో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. 8.6 శాతంతో తెలంగాణ తదనంతర స్థానంలో కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది.
వ్యవసాయ రంగం కీలకం:
రాష్ట్ర GSDP వృద్ధిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించినట్లు ఆర్థికవేత్తలు గుర్తించారు. వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో 6.4 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు(AAGR)తో ఇందులోనూ రాష్ట్రం మూడో స్థానం సాధించిందని నివేదిక తెలిపింది. ఈ రేటు మధ్యప్రదేశ్ లో అధికంగా 7.3 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో 6.6 శాతంతో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పింది. ఝార్ఖండ్ సహా తెలంగాణలు తరువాతి స్థానంలో కొనసాగుతున్నాయని పేర్కొంది.
దాన్ని కూడా పరిగణిస్తే..
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2018-19లో 9.5 శాతం, 2019-20లో 8.2, 2020-21లో 2.4, 2021-22లో 19.1, 2022-23లో 15.6 శాతం స్థిరమైన GSDP వృద్ధిరేటును నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది. 2015-16 నుంచి AAGR డేటాను స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తితో కలిపి పరిగణలోకి తీసుకుంటే కచ్చితంగా రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేదని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నట్లు చెప్పింది.
మూడింతల చేరువలోకి GSDP:
గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రెండింతలు పెరిగినట్లు పార్లమెంటులో కేంద్రం సమర్పించిన గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న GSDP 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు చేరింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ప్రస్తుతం దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకుపోతున్నట్లు అర్థమవుతోంది. స్థిరమైన రాజకీయ, ఆర్థిక పాలన కారణంగానే ఈ ఘనత సాధించినట్లు నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply