[ad_1]
ఫ్యాటీ ఫిష్..
NCBIలో ప్రచురించిన నివేదిక ప్రకారం, సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు శీతాకాలం వారి డైట్‌లో ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
సోయాబీన్..
మీరు వెజిటేరియన్స్ అయితే.. మీ డైట్‌లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ చేర్చుకోవాలంటే.. సోయాబీన్స్ బెస్ట్ ఆప్షన్. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి.. సోయా మంచి ఆహారం. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీంతో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి..
NIH అధ్యయనం ప్రకారం, వెల్లుల్లి శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆస్టియోపోరసిస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. శీతాకాలంలో మన ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా చేర్చుకుంటే.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి డయల్ డైసల్ఫైడ్ అనే సమ్మేళనం ఉంటుంది, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరంలో మంటతో పోరాడానికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
అల్లం..
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. శీతాకాలం అల్లం మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. కీళ్ల వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆలివ్ ఆయిల్..
ఆలివ్ నూనెలో ఒలియోకాథల్ ఉంటుంది. ఇది వాపు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వంటలో, సలాడ్ డ్రెస్సింగ్‌లో ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల వల్ల కీళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply