షాకిస్తున్న బంగారం ధరలతో సామాన్యులకు పసిడి అందని దాక్షే.. ఈరోజు భారీగా పెరిగిన ధరలిలా!!

[ad_1]

బంగారం చూసి మురవాల్సిందే.. కొనలేం

బంగారం చూసి మురవాల్సిందే.. కొనలేం

మరోసారి గరిష్టానికి చేరిన బంగారం ధరలు.. బంగారాన్ని చూసి మురిసిపోవాల్సిందే.. కొనుగోలు చేయలేమన్న భావనను కలిగిస్తున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 1932 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 24 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్ లో నేడు భారీగా బంగారం ధరలు

హైదరాబాద్ లో నేడు భారీగా బంగారం ధరలు

ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 53,100 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే 52,700గా ఉంది. ఇది ఈరోజు ఈ సమయానికి 400 రూపాయలు మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు 57 వేల 930 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు హైదరాబాదులో 57,490 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. నిన్నటికి ఈరోజుకి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 రూపాయల మేర పెరిగింది.

ఢిల్లీ లోనూ బంగారం ధరల దూకుడు

ఢిల్లీ లోనూ బంగారం ధరల దూకుడు

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 53,250గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నిన్న ఈ ధర 52 వేల 850 రూపాయలు గా ఉంది. నిన్నటికి ఈరోజుకి 400 రూపాయల మేర ధర పెరుగుదలను నమోదు చేసింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 58,080 రూపాయల ధర పలుకుతుంది. ఇది నిన్న 57,650 రూపాయలుగా ఉంది. నిన్నటికి ఈరోజుకి 430 రూపాయలు మేర ధర పెరిగింది.

ముంబైలో బంగారం ధరలు ఇలా.. సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం

ముంబైలో బంగారం ధరలు ఇలా.. సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 53,100 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న 52,700గా ఉన్న ధర ఒక్కసారిగా నాలుగు వందల రూపాయలు మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబైలో 57,930 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

నిన్న 57,490 రూపాయలుగా ఉన్న ధర నేడు 440 మేర పెరిగి 58 వేల దగ్గరకు చేరింది. ఈ ధరల దూకుడు ఇలాగే కొనసాగుతుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తం అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బంగారం ధరలు దూకుడు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం బంగారాన్ని అందరి ద్రాక్ష చేయనుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *