[ad_1]
Rishad Premji Salary: భారతీయ వ్యాపార ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తి అజీమ్ ప్రేమ్‌జీ. విప్రోను (Wipro) ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్థాయి నుంచి దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఆయన తీర్చిదిద్దారు. అజీమ్ ప్రేమ్‌జీ కేవలం 21 ఏళ్ల వయసులో విప్రో బాధ్యతలు చేపట్టారు, సంస్థను రూ. 2.70 లక్షల కోట్ల విలువైన కంపెనీగా అందలం ఎక్కించారు. ఆ తర్వాత, నిర్వహణ బాధ్యతలకు స్వస్థి పలికి స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేశారు అజీమ్ ప్రేమ్‌జీ.
ప్రస్తుతం, విప్రో ఛైర్మన్‌గా సంస్థ బాధ్యతలను అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ మోస్తున్నారు. రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 కోట్లు జీతంగా (Rishad Premji Salary) తీసుకున్నారు. ఇది అతని జీతంలో సగం మాత్రమే. విప్రో ఐటీ సర్వీసెస్ ఆదాయాలు తగ్గడంతో రిషద్ ప్రేమ్‌జీ ఈ నిర్ణయం తీసుకున్నారు, సగం జీతంతో సరిపెట్టుకున్నారు.
అత్యంత ఉదార వ్యక్తుల్లో అజీమ్ ప్రేమ్‌జీ ఒకరు
భారతదేశంలోని అత్యంత ఉదారమైన వ్యక్తుల్లో ఒకరిగా అజీమ్ ప్రేమ్‌జీకి (Azim Premji) గుర్తింపు ఉంది. దార్శనికత & స్వచ్ఛంద సేవల ద్వారా ఒక మహోన్నత మార్గదర్శిగా ఆయన నిలిచారు. పదవీ విరమణకు ముందు, దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఫిలాంత్రఫి లిస్ట్ 2023 (Hurun India 2023) ప్రకారం, గత ఒక్క ఏడాదిలోనే అజీమ్ ప్రేమ్‌జీ & అతని కుటుంబం సుమారు రూ. 1774 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిషద్ ప్రేమ్‌జీ కూడా తన తండ్రి పరిచిన బాటలోనే నడుస్తున్నారు. కంపెనీ కష్టాల్లో కూరుకుపోవడం చూసి తన జీతాన్ని స్వయంగా సగానికి సగం తగ్గించుకున్నారు.
రిషద్ ప్రేమ్‌జీ 2007లో విప్రో కమాండర్ బాధ్యతలు
53 ఏళ్ల పాటు విప్రోకు నాయకత్వం వహించిన అజీమ్ ప్రేమ్‌జీ, ఆ సంస్థను తన కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అప్పగించారు. రిషద్ ప్రేమ్‌జీ 2007లో విప్రోలో చేరారు. 2019లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. దీనికి ముందు వివిధ హోదాల్లో బాధ్యతలు తీసుకున్నారు, కంపెనీ స్థితిగతులను ఆకళింపు చేసుకున్నారు. వెస్లియన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివిన రిషద్ ప్రేమ్‌జీ, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా కూడా తీసుకున్నారు. రిషద్ నాస్కామ్ (NASSCOM) చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు గ్లోబల్ కంపెనీ విప్రోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విప్రోలో 2.50 లక్షల మంది పని చేస్తున్నారు.
రిషద్ ప్రేమ్‌జీ.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 9,51,353 డాలర్ల (రూ.8 కోట్లు) జీతం తీసుకున్న రిషద్.. కొవిడ్-19 సమయంలోనూ ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయమే తీసుకున్నారు. అప్పుడు కూడా రిషద్ స్వయంగా తన జీతంలో 31 శాతం కోత విధించుకున్నారు. రిషద్ ప్రేమ్‌జీ విప్రో ఎంటర్‌ప్రైజెస్, విప్రో జీఈ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ బోర్డుల్లోనూ మెంబర్‌గా సేవలు అందిస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: క్రెడిట్ స్కోర్ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply