సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా ఉండాలంటే.. ఈ ఫ్రూట్స్‌ తినేయండి..!

[ad_1]

Summer Fruits: సమ్మర్‌ స్టార్ట్‌ అయ్యింది. ఎండలు మండిపోతున్నాయి.. సూర్యుడి ప్రతాపంతో.. శరీర ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. వాతావరణంలోని విపరీతమైన వేడి కారణంగా.. శరీరంలోని నీటినంతా చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌, అలసట, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయి. చెపట ఎక్కువగా పట్టడం వల్ల బాడీలోని ఎలక్ట్రోలైట్స్‌‌‌‌‌‌‌ స్థాయుల్లో మార్పులు జరుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వేసవిలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వేసవికాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా, బాడీని కూల్‌గా ఉంచడానికి ఏ పండ్లు తీసుకోవాలో ఈ స్టోరీలో చూసేద్దాం.

కర్బూజ..

కర్బూజ..

కర్బూజలో దాదాపు 90 శాతనికి పైగా నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు.. తక్షణ శక్తిని అందించడానికి సహాయపడుతుంది. కర్బూజలో విటమిన్‌ ఏ, , బి-6, ఐరన్, మెగ్నీషియం, డైటరీ ఫైబర్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కర్బూజ మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా ఉంచడంతో పాటు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలనూ దూరం చేస్తాయి. కర్బూజలోని కెరోటినాయిడ్స్‌.. క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి. దీంట్లోని విటమిన్‌-ఎ ఎండలకు చర్మం మీద మచ్చలు పడకుండా కాపాడుతుంది. రోజంతటికీ అవసరమైన సి విటమిన్‌ను కర్బూజా అందిస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. దీంట్లోని పొటాషియం హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. కర్బూజను జ్యూస్‌, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

పుచ్చకాయ..

పుచ్చకాయ..

పుచ్చకాయను.. సమ్మర్‌ పర్ఫెక్ట్‌ ఫ్రూట్‌ అనొచ్చు. దీనిలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటింగ్‌గా, ఫిల్లింగ్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ మీ డైట్‌లో చేర్చుకుంటే ఉక్కపోత, వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు తిరిగి వస్తుంది. మూత్రం సరిగా రానపుడు, మూత్రం మంటగా అనిపించినపుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది. పుచ్చకాయలో పుష్కలంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పుచ్చకాయలో లైకోపీన్‌, విటమిన్‌ A, B6, C , యంటీఆక్సిడెంట్స్‌, అమైనో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మామిడిపండ్లు..

మామిడిపండ్లు..

మామిడి పండ్లు లేకుండా వేసవిని ఊహించడం అసాధ్యంలో. మామిడి పండ్లలో ప్రొటీన్లు, విటమిన్లు A, B6, C, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, డైటరీ ఫైబర్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మామడి పండులో 82 శాతం నీరూ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. మామిడి పండు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయులను కంట్రోల్‌లో ఉంచుతుంది.

అరటిపండు..

అరటిపండు..

అరటిపండు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. దీనిలో ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, C వంటి పోషఖాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మీ రోగనిరధక శక్తిని బూస్ట్‌ చేస్తాయి. . వేసవిలో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉంటాయి. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మీరు వేసవిలో కూల్‌ కూల్‌గా ఉండాలంటే… అరటిపండు షేక్స్‌, స్మూతీస్‌ తీసుకోండి.

తాటిముంజెలు..

తాటిముంజెలు..

తాటిముంజెలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి. తాటిముంజెలలో కార్బొహైడ్రేట్లు, ఫైటో న్యూట్రియంట్లు, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో క్యాలరీలూ తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిని తింటే ఉపశమనం లభిస్తుంది.

Also Read: తాటి ముంజలు తింటే.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాదా..?

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *