[ad_1]
మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది..? కాబట్టి మీకు లోన్ రాదు. మీకు సిబిల్ స్కోర్ చాలా బాగుంది. కాబట్టి మీకు లోన్ ఈజీగా వస్తుందంటూ మనకు నిత్యం పలు బ్యాంక్స్ నుంచి కాల్స్ లేదా మెస్సెజ్‌లు వస్తుంటాయి. అయితే సిబిల్ స్కోర్ అంటే ఏమిటి.? ఇంతకీ.. సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి.. ఎంత తక్కువ ఉంటే లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్‌లు జారీ చేయరు అనే ఆలోచన ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.
సిబిల్:
సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Credit information company operating in India). ఇది వ్యక్తుల, క్రెడిట్ సంబంధిత కార్యకలాపాల రికార్డులను నిర్వహించడంలో నిమగ్నమై ఉన్న ఇన్ఫర్మేషన్ కంపెనీ అని చెప్పవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతి నెలా రుణాలు తీసుకొన్న వారి వివరాలను సిబిల్‌కు అందజేస్తాయి. ఈ వివరాల ఆధారంగా ఆయా వ్యక్తులకు సంబంధించిన క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ అందిస్తుంది. ఈ రోజుల్లో ఎలాంటి రుణాలు పొందాలన్నా సిబిల్ స్కోర్ కీలకం. అయితే బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్‌సంస్థల నుంచి తీసుకున్న లోన్‌ను, తిరిగి చెల్లించిన వివరాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ లెక్కిస్తారు. రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు ఉన్నా, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్ స్కోర్‌పై కనిపిస్తుంది. అంతేకాదు.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ సిబిల్ రిపోర్ట్‌లో సంబంధిత వ్యక్తి సిబిల్ స్కోర్, రుణాలు తీసుకోవడం, చెల్లించడం, వ్యక్తిగత వివరాలు, కాంట్యాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, లోన్ అకౌంట్ వివరాలు ఉంటాయి.
సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి.?
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ విలువను సూచిస్తుంది. లోన్లు లేదా క్రెడిట్ కార్డులపై త్వరిత అప్రూవల్ మెరుగై డీల్స్ పొందడానికి అధిక స్కోరు ఉండేలా చూసుకోవాలి. ఆర్బీఐ రూల్స్‌కు ప్రకారం.. అన్ని బ్యాంకులు లేదా నాన్ బ్యాంకుల్లో లోన్ అప్రూవల్ కోసం అవసరమైన కనీస క్రెడిట్ స్కోర్ 750 ఉండాలి. అయితే 900 గరిష్ట క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. మీ క్రెడిట్ రోపోర్ట్‌కు 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే అది ఉత్తమమైనది అనే చెప్పాలి. 750 స్కోర్ అద్భుతమైన స్కోర్ పరిధిలోకి వస్తుంది. నమ్మదగిన రుణగ్రహిత అని రుణదాతలను చూపుతుంది. అందువల్ల.. 750కి పైగా సిబిల్ స్కోర్ కలిగి ఉండటం అనేది పర్సనల్ లోన్లు ఇంకా క్రెడిట్ కార్డుల కోసం మీకు అర్హత సాధించడంలో సహాయపడుతుంది.
క్రెడిట్ స్కోర్ తగ్గకుండా ఎలాంటి ఈ జాగ్రత్తులు తీసుకోవాలి:
మీరు తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవడం మంచిది. కరెక్ట్ సమయానికి, ముందుగానే బ్యాంక్‌తో డీల్ చేసుకున్న తేదీకి లోన్ అమౌంట్ కట్టాలి. వసూలు కానీ బాకీలు రాబట్టుకోవడానికి బ్యాంకులు కొన్ని బయట సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సంస్థల చేతిలోకి వెళ్లిన జాబితాలో ఉన్న వాళ్ల క్రెడిట్ స్కోర్ చాలా తగ్గిపోతుంది. ఏదైనా ఒకే క్రెడిట్ కార్డ్ ఎక్కువ రోజులుగా వాడుతుంటే అది రద్దు చేసుకోవద్దు. అలా చేసుకోవడం వల్ల ఎంతో విలువైన మీ పేమెంట్స్ హిస్టరీ రేటింగ్ ఏజెన్సీ వాళ్లకు అందుబాటులోకి రాదు. అప్పుడప్పుడూ క్రెడిట్ రిపోర్ట్ చూసుకుంటూ ఏవైనా తేడాలుంటే సదరు రేటింగ్ ఏజెన్సీని సంప్రదించి సరిచూసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదు.
News Reels
[ad_2]
Source link
Leave a Reply