సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన First Citizens.. డీల్ పూర్తి వివరాలు

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Silicon Valley Bank: యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆందోళనల్లోకి నెట్టింది అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అయితే ఇది స్టార్టప్ కంపెనీలకు నిధులను అందించటంలో రక్తం లాంటిది. దీనిని కాపాడేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంకు అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. డిపాజిటర్ల సొమ్ముకు సైతం గ్యారెంటీ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో కంపెనీ చేతులు మారుతోంది.

అవును స్టార్టప్ కంపెనీలతో ఎక్కువగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో 16వ అతిపెద్ద సిలికాన్ వ్యాలీ చేతులు మారిపోయింది. నిధుల కొరతతో కుప్పకూలిన ఈ బ్యాంకును ఫస్ట్ సిటిజన్స్ చేజిక్కించుకుంది. దీనికి ముందు రెండు సంస్థల మధ్య చర్చలు తారా స్థాయికి చేరాయని.. తర్వలోనే డీల్ జరగవచ్చని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజా డీల్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఖాతాదారుల్లో కొత్త ఆనందాన్ని కలిగిస్తోంది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసిన First Citizens..

ఫస్ట్ సిటిజన్, సిలికాన్ వ్యాలీ బ్యాంకుల మధ్య జరిగిన డీల్ ప్రకారం కుప్పకూలిన SVB డిపాజిట్లు, రుణాలను చేతులు మారాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా తీసిన తర్వాత దానిని సొంతం చేసుకునేందుకు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ తన బిడ్‌ను సమర్పించింది. తాజా చర్చల తర్వాత సమస్యాత్మక SVB ఫైనాన్షియల్ గ్రూప్ కు చెందిన అన్ని డిపాజిట్లు, రుణాలను పొందేందుకు ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ & ట్రస్ట్ అంగీకరించిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంకుకు చెందిన సుమారు 72 బిలియన్ డాలర్ల ఆస్తులను 16.5 బిలియన్ల తగ్గింపుతో కొనుగోలు ఒప్పందం జరిగిందని సమాచారం. మార్చి 10 నాటికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్, నేషనల్ అసోసియేషన్ దాదాపుగా 167 బిలియన్ డాలర్లు విలువైన ఆస్తులతో పాటు 119 బిలియన్ డాలర్ల డిపాజిట్లకు కలిగి ఉన్నాయి. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ బ్యాంకును సొంతం చేసుకున్న అమెరికా బ్యాంక్ ఫస్ట్ సిటిలజన్స్ దేశంలో 30వ అతిపెద్ద బ్యాంకుగా తెలుస్తోంది. దీనికి అమెరికాలోని 22 రాష్ట్రాల్లో మెుత్తంగా 500 కంటే ఎక్కువ బ్యాంక్ శాఖలు ఉన్నాయి.

ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏమిటంటే 1971 నుంచి ఇప్పటి వరకు దివాలా తీసిన 35 కంటే ఎక్కువ బ్యాంకులను కొనుగోలు చేసింది. అమెరికా చరిత్రలో ఇది ఒక రికార్డు. ప్రస్తుతం బ్యాంక్ 109 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉండగా.. డిపాజిట్ల రూపంలో 89.4 బిలియన్ డాలర్లను కలిగి ఉంది. తాజా కొనుగోలుకు ముందు 2022లో CIT గ్రూప్ Incను 2 బిలియన్ డాలర్ల విలువైన డీల్ కు కొనుగోలు చేసింది.

English summary

Collapsed US silicon valley bank was bought by First Citizens sources confirmed

Collapsed US silicon valley bank was bought by First Citizens sources confirmed

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *