సూర్యుడి ఉపరితలపై భారీ విస్ఫోటనం.. భూమి దిశగా సౌర తుఫాను.. విధ్వంసం సృష్టించనుందా?

[ad_1]

సూర్యుడి (Sun) ఉపరితలంపై అధిక సంఖ్యలో అయస్కాంత తంతువుల గురించి ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేశారు. ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలతో నిండి ఉండే ఈ తంతువులు.. యాదృచ్ఛికంగా సూర్యుని ఉపరితలంపై పెద్ద పేలుళ్లకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న తంతువుల్లో ఒకదానిలో భారీ పేలుడును నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. అంతేకాదు, దీని కారణంగా భూమివైపునకు భారీ కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) మేఘాలు కదలి వస్తున్నట్టు గమనించింది. తత్ఫలితంగా ఏర్పడే సౌర తుఫాను ప్రమాదకరమైనదిగా ఉంటుందని ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి.

నాసా వెబ్‌సైట్‌లో స్పేస్‌వెదర్ రిపోర్ట్‌ ప్రకారం.. ‘‘ఏప్రిల్ 21న సూర్యుడి దక్షిణార్ధగోళంలోని విస్పోటనం చెందిన ఓ అయస్కాంత తంతువు భూమివైపునకు కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను విసిరింది.. ఈ పేలుడుతో ఖచ్చితంగా సీఎంఈని భూమివైపునకు పంపింది.. ఎస్ఓహెచ్ఓ ఫోటోలు ఇది నేరుగా మన గ్రహం వైపునకు వస్తున్నట్లు నిర్ధారిస్తున్నాయి… CME బహుశా ఏప్రిల్ 24న భూమికి చేరుకుంటుంది. దీని వల్ల G1 నుంచి G2 క్లాస్ భూ అయస్కాంత తుఫానులు సంభవిస్తాయి’’ అని పేర్కొంది.

సౌర కార్యకలాపాలు ప్రస్తుతం అత్యధిక స్థాయిలో ఉన్నాయి. సూర్యుడు తన 11 ఏళ్ల సౌర చక్రం శిఖరానికి చేరుకోవడం వల్ల సాధారణ స్థితికి చేరుకునే ముందు మధ్యలో ఎక్కడో పడిపోతుంది. సూర్యుని ఉపరితలంపై అస్థిర అయస్కాంత క్షేత్రాలను సూచించే సూర్యరశ్మిలు, అయస్కాంత తంతువులు ఎక్కువగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. తొలుత నాసా నుంచి వచ్చిన చనలతో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సౌర తుఫాను తీవ్రతపై నమూనాను సిద్ధం చేయడం కొనసాగిస్తోంది.

నాసా ప్రకారం.. సూర్యుడి అయస్కాంత తంతువుల్లో విస్ఫోటనం ఫలితంగా సంభవించే సౌర తుఫాను G2 క్లాస్ కంటే తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి శక్తివంతమైన సౌర తుఫానులు సాధారణంగా తీవ్రమైన అరోరా ప్రదర్శనను ప్రదర్శిస్తాయి. కానీ, వెలుగులు వెదజిమ్మే ఇవి మన మౌలిక సదుపాయాలకు పెద్దస్థాయిలో హాని కలిగిస్తాయి. ఈ సౌర తుఫానులు ఉపగ్రహాలను దెబ్బతీసి, మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలను విచ్ఛిన్నం చేయగలవు. పవర్ గ్రిడ్ వైఫల్యాలకు కారణమవుతాయి. అంతేకాదు, సున్నితమైన భూ ఆధారిత ఎలక్ట్రానిక్‌లను నాశనం చేయగలవు.

సూర్యుడిపై అధ్యయనానికి నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) పూర్తిస్థాయిలో సౌకర్యాలను కలిగి ఉంది. వివిధ సౌర కార్యకలాపాల సమాచార సేకరణకు మూడు చాలా కీలకమైన పరికరాలను ఉపయోగిస్తుంది. మొత్తం కనిపించే సౌర డిస్క్‌పై రేఖాంశ, వెక్టర్ అయస్కాంత క్షేత్రం హైరిజల్యూషన్ తీసుకునే హీలియోసిస్మిక్ అండ్ మాగ్నెటిక్ ఇమేజర్ (HMI), సూర్యుడి తీవ్ర అతినీలలోహిత వికిరణాన్ని కొలిచే ఎక్స్‌ట్రీమ్ అల్ట్రా వయొలెట్ వేరియబిలిటీ ఎక్స్‌పెరిమెంట్ (EVE), ఏడు తీవ్ర అతినీలలోహిత ఛానెల్‌లలో సౌర క్రోమోస్పియర్, కరోనా నిరంతర పూర్తి డిస్క్ పరిశీలనలను అందించే అట్మాస్ఫియరిక్ ఇమేజింగ్ అసెంబ్లీ (ఇమేజింగ్) ఉన్నాయి.

Read MoreLatest Science & Technology NewsAndTelugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *