స్టాక్ మార్కెట్‌లో రెండోరోజూ సందడి – 64400 దాటిన సెన్సెక్స్‌, 19200 పైన నిఫ్టీ

[ad_1]

Share Market Opening on 03 November 2023: ఇండియన్‌ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు కూడా సందడి వాతావరణం కనిపించింది, ఈ రోజు (శుక్రవారం) ట్రేడింగ్‌ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లభిస్తోంది, ఆసియా మార్కెట్లు కూడా బలంగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ మద్దతుతో మార్కెట్ పెరగడంతోపాటు ఐటీ షేర్లు కూడా లాభపడ్డాయి. మార్కెట్ సెంటిమెంట్ బాగుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం మార్కెట్‌లో మంచి రోజులు (Stock Market Update) నడుస్తున్నాయి. పండుగల సీజన్ ప్రభావం కూడా మార్కెట్‌ మీద పాజిటివ్‌గా ఉంది.

స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఇలా..
ఈ రోజు, BSE సెన్సెక్స్ 364 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 64,444 స్థాయి వద్ద ప్రారంభమైంది. NSE నిఫ్టీ 107.75 పాయింట్లు లేదా 0.56 శాతం పెరుగుదలతో 19,241 వద్ద ఓపెన్‌ అయింది.

ఈ రోజు ఓవరాల్‌ మార్కెట్‌కు బ్యాంక్ నిఫ్టీ నుంచి మంచి మద్దతు లభిస్తోంది, ఇది 230 పాయింట్లకు పైగా వృద్ధితో ట్రేడ్‌ అవుతోంది. ప్రారంభ నిమిషాల్లో 43,241 స్థాయి వద్ద బ్యాంక్ నిఫ్టీ కనిపించింది.

ఈ రోజు ఓపెనింగ్‌ టైమ్‌లో మార్కెట్‌లో అడ్వాన్స్-డిక్లైన్ రేషియోను పరిశీలిస్తే… చాలా స్టాక్స్‌ విపరీతమైన వేగంతో పరుగులు పెడుతున్నాయి. 1,625 షేర్లు బలంతో ట్రేడవుతుండగా, 326 షేర్లు క్షీణించాయి. 92 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

సెన్సెక్స్ షేర్ల చిత్రం
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 24 స్టాక్స్‌ లాభాలతో ట్రేడవుతుండగా, 6 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌లో అత్యధికంగా 1.88 శాతం పెరుగుదల కనిపించింది, టెక్ మహీంద్ర 1.77 శాతం గ్రీన్‌లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.41 శాతం, టైటన్ 1.33 శాతం లాభపడ్డాయి. సన్ ఫార్మాలో 1.02 శాతం, ఇన్ఫోసిస్‌లో 0.99 శాతం పెరుగుదల కనిపించింది.

నిఫ్టీ ప్యాక్‌ పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లో 44 స్టాక్స్‌ బుల్లిష్ మార్క్‌తో ట్రేడవుతుండగా, 6 స్టాక్స్‌ డిక్లైన్‌ జోన్‌లో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో అపోలో హాస్పిటల్స్ 4.52 శాతం, టాటా మోటార్స్ 2.24 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.08 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2 శాతం, యూపీఎల్ 1.88 శాతం ఎగబాకాయి.

నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లోని అన్ని రంగాలు చురుగ్గా ఉన్నాయి. హెల్త్‌కేర్ ఇండెక్స్‌లో అత్యధికంగా 0.92 శాతం పెరిగింది. మీడియా షేర్లు 0.82 శాతం, మెటల్ స్టాక్స్ 0.79 శాతం, ప్రైవేట్ బ్యాంకులు 0.75 శాతం చొప్పున పెరిగాయి.

స్టాక్ మార్కెట్ ప్రీ-ఓపెనింగ్‌లో, సెన్సెక్స్ 0.80 శాతం లేదా 510.86 పాయింట్ల పెరుగుదలతో 64,591 స్థాయి వద్ద ట్రేడయింది. నిఫ్టీ 162.35 పాయింట్లు లేదా 0.85 శాతం లాభంతో 19,295 స్థాయిలో ట్రేడయింది.

ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 381.16 పాయింట్లు లేదా 0.59% గ్రీన్‌లో 64,462 వద్ద ఉండగా; నిఫ్టీ 119.60 పాయింట్లు లేదా 0.63% లాభంతో 19,252 వద్ద కదులుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *