హమ్మయ్య – ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లపై బ్యాన్‌ 3 నెలలు వాయిదా

[ad_1]

Laptop Imports: ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతులపై గురువారం నాడు హఠాత్తుగా, తక్షణం అమల్లోకి వచ్చేలా బ్యాన్‌ విధించి భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం, శుక్రవారం రోజు కొంచం రిలీఫ్‌ ప్రకటించింది. HSN కోడ్‌ 8471 కిందకు వచ్చే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్ల ఇంపోర్ట్స్‌పై విధించిన నిషేధాన్ని మరో 3 నెలల పాటు పక్కనపెట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 1వ తేదీ నుంచి బ్యాన్‌ అమలవుతుందని అప్‌డేట్‌ ఇచ్చింది. దీంతో, ఈ ఏడాది అక్టోబర్‌ 31 వరకు వీటి దిగుమతులపై నిషేధం లేనట్లే, యథావిధిగా ఇంపోర్ట్స్‌ కొనసాగుతాయి.

HSN కోడ్ 8471 అంటే ఏంటి?
‘హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నమెన్‌క్లేచర్‌’ (HSN) కోడ్ అంటే, పన్ను ప్రయోజనాల కోసం ప్రొడక్ట్స్‌ను గుర్తించడానికి ఉపయోగించే వర్గీకరణ వ్యవస్థ (classification system). డేటా ప్రాసెసింగ్ మెషీన్లు HSN కోడ్ 8471 కిందకు వస్తాయి. డేటా ప్రాసెసింగ్ పనులను నిర్వహించేందుకు రూపొందించిన డివైజ్‌లను గుర్తించడానికి ఈ కోడ్‌ను ఉపయోగిస్తారు.

రోజంతా బ్యాక్-టు-బ్యాక్ కాల్స్
గురువారం రోజున (03 ఆగస్టు 2023), HSN కోడ్ 8471 కిందకు వచ్చే డివైజ్‌ల మీద ఇమ్మీడియట్‌ ఎఫెక్ట్‌తో విధించిన బ్యాన్‌ కారణంగా అతి పెద్ద హార్డ్‌వేర్ కంపెనీల సప్లై చైన్స్‌లో గందరగోళం ఏర్పడింది. వాటి కన్‌సైన్‌మెంట్స్‌ కస్టమ్స్‌ దగ్గర నిలిచిపోయాయి. ఆ కంపెనీల ఆఫీసుల నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఆఫీసుకు రోజంతా ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. విదేశాలకు తాము ఆర్డర్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్లు డెలివెరీ దశలో ఉన్నాయని, హఠాత్తుగా బ్యాన్‌ విధిస్తే ఆ కన్‌సైన్‌మెంట్స్‌ ఏం కావాలంటూ బాడా కంపెనీలు ప్రశ్నల వర్షం కురిపించాయి. తమ ఆర్డర్ల ప్రకారం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, పర్సనల్‌ కంప్యూటర్లను ఫారిన్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేస్తున్నారని, వాటి సంగతేంటని కూడా అడిగాయి. అందులోనూ, దేశంలో పండుగల సీజన్‌కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము బిజినెస్‌ ఎలా చేస్తామని అడిగాయి. ఇప్పటికే పెట్టిన ఆర్డర్లు, డెలివెరీ దశలో ఉన్న వస్తువులను తాము తీసుకునే వరకు వెసులుబాటు ఇవ్వాలని అడిగాయి. దీంతోపాటు, ఆయా డివైజ్‌లను దిగుమతి చేసుకోవడానికి ‘చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌’ పొందడానికి మరో మూడు నెలల టైమ్‌ ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేశాయి. 

ఇండస్ట్రీకి చెందిన కంపెనీలు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆఫీస్‌తో పాటు ఆపిల్‌ (Apple), శామ్‌సంగ్‌ (Samsung), హెచ్‌పీ (HP), డెల్‌ (Dell) వంటి మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలతోనూ రోజంతా బ్యాక్-టు-బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉన్నాయి, నెక్ట్స్‌ స్టెప్స్‌ ఎలా ఉండాలో ప్లాన్స్‌ చేశాయి. ఎందుకంటే, దిగుమతులపై అనిశ్చితి కారణంగా యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు వాటి ప్రొడక్ట్స్‌ పంపడాన్ని తక్షణం ఆపేస్తాయి. 

బడా హార్డ్‌వేర్‌ కంపెనీల ఆగ్రహావేశాలు, రిక్వెస్ట్‌లు, వాటిపై పడుతున్న నెగెటివ్‌ ఇంపాక్ట్‌ను పరిగణనలోకి తీసుకున్న DGFT, నిన్న (శుక్రవారం, 04 ఆగస్టు 2023) ఒక నోటిఫికేషన్‌ ఇష్యూ చేసింది. హార్డ్‌వేర్‌ ఇండస్ట్రీకి మూడు నెలల ఉపశమనాన్ని ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం… నవంబర్ 1 నుంచి ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్స్‌ దిగుమతులు ‘ఆంక్షలు’ కొనసాగుతాయి. DGFT నుంచి ‘చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌’ తీసుకోవడానికి కంపెనీలకు అప్పటి వరకు సమయం ఉంటుంది.

గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపింది. ఇది ‘లైసెన్స్‌ రాజ్‌’ అంటూ విమర్శలు వినిపించాయి. తన నిర్ణయాన్ని సెంట్రల్‌ గవర్నమెంట్‌ సమర్థించుకుంది. “దేశంలో ట్రస్టెడ్‌ హార్డ్‌వేర్, సిస్టమ్స్‌ అందుబాటులో ఉండేలా చూడడం & దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆ ప్రొడక్ట్స్‌ దేశీయ తయారీని పెంచడం ప్రభుత్వ లక్ష్యం” అని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్‌ చేశారు.

మన దేశానికి అత్యధికంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూట్‌లు ఎగుమతి చేసే దేశం చైనా. 2022-23లో, భారతదేశం దిగుమతి చేసుకున్న $5.33 బిలియన్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లలో 75 శాతానికి పైగా డ్రాగన్‌ కంట్రీ నుంచి వచ్చాయి. దేశంలో సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడానికే లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వంలోని కొందరు చెబుతున్నారు.

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది ఐపీవో సినిమా బ్లాక్‌బస్టర్‌, ఇన్వెస్టర్ల కళ్లలో ఆనందం చూసిన కంపెనీలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *