హిందుస్థాన్ యూనిలివర్ వ్యాపారానికి ఎసరు పెట్టిన అంబానీ.. మరో యుద్ధం తప్పదా..?

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Reliance: ఏ వ్యాపారంలోకైనా అంబానీ(Mukesh Ambani) రాకముందు వరకు ఒక లెక్క. అంబానీ అడుగు పెట్టిన తర్వాత మరో లెక్క. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు ఆయన తన రిలయన్స్ జియో వ్యాపారంలో దీనిని అక్షరాలా నిరూపించి చూపించారు. తాజాగా ఐపీఎల్ ప్రసారాలను ఓటీటీలో ఉచితంగా అందిస్తూ చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ తన ఎఫ్ఎమ్‌సీజీ వ్యాపార విస్తరణలోనూ అదే యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తోంది. రంగం ఏదైనా యుద్ధ అంబానీల వ్యాపార రణతంత్రం ఒక్కటే. ఇందుకోసం ఇండిపెండెన్స్ పేరుతో తన వ్యాపారాన్ని దేశంలో ఇప్పటికే ప్రారంభించింది. దీనిలో భాగంగానే ఇటీవల రిలయన్స్ గ్రూప్ ఫుడ్ అండ్ బివరేజెస్ రంగంలో చాలా కంపెనీలను క్రమంగా హస్తగతం చేసుకుంటూ వచ్చింది.

హిందుస్థాన్ యూనిలివర్ వ్యాపారానికి ఎసరు పెట్టిన అంబానీ..

దేశంలోని బ్రాండెడ్ ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లుగా ఉంది. దీనిని తన పర్సనల్ కేర్, సౌందర్య ఉత్పత్తులతో కొల్లగొట్టాలని రిలయన్స్ కన్జూమర్ ప్రాడక్ట్స్ నిర్ణయించింది. అంబానీ రంగంలోకి దిగితే వ్యాపార పరిస్థితులు ఎలా మారిపోతాయనే విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా కంపెనీ తన వ్యాపారాన్ని ఆధునిక రిటైల్ స్టోర్స్, ఈ కామర్స్ తో పాటు తనకు ఉన్న 30 లక్షల కిరాణా దుకాణాల బలంతో దేశంలో విస్తృతంగా మారుమూలలకు సైతం విస్తరించాలని మెగా ప్లాన్ చేసింది.

రిలయన్స్ చేపడుతున్న ఈ మెగా వ్యాపార ఆపరేషన్ హిందుస్థాన్ యూనిలివర్(HUL) కంపెనీకి పెద్ద పోటీని ఇస్తుందని తెలుస్తోంది. ఈ యుద్ధం కారణంగా HUL మెజారిటీ వ్యాపారంలో వాటాను కోల్పోయే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కంపెనీ డవ్, లైఫ్ బాయ్, పియర్స్, లక్స్ వంటి పాపులర్ సోప్ బ్రాండ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇక లాండ్రీ ఉత్పత్తులు, సబ్బులు, డిజర్జంట్లు, లిక్విడ్ డిటర్జంట్లు వంటి అనేక ఉత్పత్తుల మార్కెట్లో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. ఇదే రంగంలో ఐటీసీ, గోద్రేజ్, పీ అండ్ జీ వంటి ఇతర కంపెనీలు సైతం వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి.

English summary

Mukesh Ambani’s Reliance group ready to disrupt FMCG business a big challange to Hindustan Uniliver

Mukesh Ambani’s Reliance group ready to disrupt FMCG business a big challange to Hindustan Uniliver..

Story first published: Thursday, March 23, 2023, 20:29 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *