హైదరాబాద్‌లో చెత్తకు ఆయిల్ స్కీం.. పెట్రో ధరలపై ఇలా డిస్కౌంట్ పొందొచ్చు, కానీ..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

అంతకంతకూ
పెరుగుతున్న
ఇంధన
ధరలను
మనం
ఎలాగూ
కంట్రోల్
చేయలేం.
కనీసం
మనకు
పనికిరాని
వాటిని
ఉపయోగించి
తక్కువ
ధరకే
పెట్రోల్
పొందితే
ఎలా
ఉంటుంది
?
ఏంటి

చెత్త
వాగుడు,
ఇదేమైనా
ఎక్స్ఛేజ్
ప్రోగ్రామా
అనుకుంటున్నారా..?
అవును
ఇది
నిజంగానే
చెత్త
ఎక్స్ఛేంజ్
ప్రోగ్రాం.
దీని
పూర్తి
వివరాలేంటో
చూద్దాం..

ప్రముఖ
ఆయిల్
మార్కెటింగ్
కంపెనీ
ఇండియన్
ఆయిల్
కార్పొరేషన్
లిమిటెడ్(IOCL)

వినూత్న
కార్యక్రమానికి
శ్రీకారం
చుట్టింది.
‘రీఫ్యూయల్‌
విత్‌
రీసైకల్‌’
పేరిట
Recykal
తో
కలిసి
పర్యావరణ
పరిరక్షణకు
నడుం
బిగించింది.
హైదరాబాద్
వాసులు
తమ
ఇంట్లోని
వ్యర్థాలను
రీసైక్లింగ్
చేయడం
ద్వారా
ఆరోగ్యకరమైన
వాతావరణాన్ని
సృష్టించేందుకు
చేతులు
కలపాలని
ప్రోత్సహిస్తోంది.

హైదరాబాద్‌లో చెత్తకు ఆయిల్ స్కీం.. పెట్రో ధరలపై ఇలా డిస్కౌంట

ఇండియన్
ఆయిల్
పెట్రోల్
బంకులలో
QR
కోడ్‌
ని
స్కాన్
చేయడం
ద్వారా

ప్రోగ్రాంలో
రిజిస్టర్
కావచ్చు.
ఆయా
వ్యక్తులు
తమ
చెత్తను
అక్కడ
తూకం
వేసి
బరువుకు
తగినన్ని
క్రెడిట్
పాయింట్లు
సంపాదించవచ్చు.
ఇంధనం
నింపుకునే
సమయంలో

పాయింట్లను
రిడీమ్
చేసుకుని
పెట్రోల్
ఖర్చు
తగ్గించుకోవచ్చు.

ఆగస్టు
2023
వరకు
పైలట్
ప్రాజెక్టుగా

ప్రోగ్రాం
కొనసాగుతుంది.
హైదరాబాద్‌
లో
ఎంపిక
చేసిన
హైటెక్
సిటీ
COCO,
TSIIC
నాలెడ్జ్
సిటీ,
జూబ్లీ
హిల్స్
రోడ్
నం
36
COCO,
మియాపూర్
సైబర్
ఫిల్లింగ్
స్టేషన్,
బేగంపేట
COCO
పెట్రోల్
బంకులలో
మాత్రమే
ఇందుకు
అవకాశం
కల్పించారు.
మొదటగా

5
చోట్ల
స్టార్ట్
చేసినా
వినియోగదారుల
స్పందన
ఆధారంగా
భవిష్యత్తులో
34
వేల
బంకులనూ
కవర్
చేసేలా
ప్లాన్
చేశారు.

ప్రజలు
ప్లాస్టిక్
వ్యర్థాలు,
పేపర్,
కార్డ్‌
బోర్డ్,
మొబైల్స్,
ల్యాప్‌
టాప్‌లు,
నెట్‌
వర్క్
పరికరాలు,
కేబుల్స్
సహా
ఇతర
పనికిరాని
వస్తువులను
పై
5
ఇండియన్
ఆయిల్
బంకుల్లో
ఇవ్వవచ్చు.
10
కిలోల
కంటే
ఎక్కువ
వ్యర్థాలను
అందించిన
వారికి
కొంత
అదనపు
బెనిఫిట్
ఉంటుంది.
ఉచిత
ఇంధనాన్ని
ఆస్వాదిస్తూనే,
వ్యర్థాలను
బాధ్యతాయుతంగా
రీసైకిల్
చేసే
అవకాశం
లభిస్తుంది.
తద్వారా
పరిశుభ్రమైన
సమాజ
స్థాపనకు
సహకరించినట్లవుతుంది.

English summary

Indian Oil offering fuel points for deposit household waste

Indian Oil offering fuel points for deposit household waste

Story first published: Monday, July 17, 2023, 7:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *