[ad_1]
పాలకూర..
పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హైపర్‌టెన్షన్ పేషెంట్స్ వారి డైట్లో పాలకూర తరచుగా తీసుకుంటే.. మేలు జరుగుతుంది.
అరటిపండు..
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు.. అరటి పండ్లు తింటే చాలా మంచిది. ఈ తియ్యటి పండ్లలో సోడియం తక్కువగా ఉండటమే కాదు, పొటాషియం మెండుగా ఉంటుంది.. ఇది బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలూ మెండుగా ఉంటాయి. అరటిపండు తింటే.. జీర్ణ సమస్యలలో కూడా దూరమవుతాయి.
బీట్రూట్..
బీట్రూట్ హైపర్‌టెన్షన్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. దీనిలో నైట్రేట్స్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల హైపర్‌టెన్షన్ కంట్రోల్లో ఉంటుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. హైపర్‌టెన్షన్ ఉన్నవారు.. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ బీట్రూట్ జ్యూస్ తాగితే.. సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ యావరేజ్‌గా 4 నుంచి 5 పాయింట్లు తగ్గుతుంది.
ఓట్స్..
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఇది సిస్టోలిక్ మరియు డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ తగ్గిస్తుంది.
సెలరీ..
ప్రతి రోజూ సెలరీ తీసుకుంటే.. హైపర్‌టెన్షన్ తగ్గుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సెలరీలో థాలైడ్‌లు ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, అధిక బీపీ స్థాయిలను తగ్గించడానికి , ధమనుల గోడలలోని కండరాల కణజాలాన్ని సడలించడానికి సహాయపడతాయి.
దానిమ్మ..
సాధారణంగా, శరీరంలో రక్త తక్కువగా ఉంటే.. డాక్టర్ దానిమ్మ తినమని సూచిస్తారు. దానిమ్మ ACE ఎంజైమ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది రక్త నాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దానిమ్మ రసంతో హానికారక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన ఫైబర్ దానిమ్మపండ్లలో అధికం. కప్పు దానిమ్మ గింజల్లో ఏకంగా ఏడు గ్రాముల పైబర్ ఉంటుంది. దానిమ్మ పండు, జ్యూస్ శరీరానికి చాలా మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply