హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది – కంపెనీ ఏం మార్పులు చేసింది?

[ad_1]

Honda Hornet 2.0: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ తన కొత్త 2023 హార్నెట్ 2.0ని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.39 లక్షలుగా నిర్ణయించారు. కొత్త హార్నెట్‌లో కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు అందించారు. దీని బీఎస్6 ఇంజన్ ఓబీడీ2 కంప్లైంట్‌గా ఉంది. కొత్త హోండా హార్నెట్ 2.0 మొత్తం నాలుగు రంగులలో లభిస్తుంది. ఇందులో పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఆప్షన్లు ఉన్నాయి.

డిజైన్ ఎలా ఉంది?
దీని డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త హార్నెట్‌లో మస్కులర్ డిజైన్, హెడ్‌లైట్ అసెంబ్లీ, ఎక్స్ ఆకారపు టెయిల్ ల్యాంప్‌లు అలాగే ఉన్నాయి. అయితే ఇందులో స్పోర్టినెస్ పెంచేందుకు కొత్త గ్రాఫిక్స్ ఇచ్చారు. చిన్న ఎగ్జాస్ట్, స్ప్లిట్ సీట్ల ద్వారా హార్నెట్ స్పోర్టినెస్ మరింత మెరుగుపడుతుంది.

ఇంజిన్ ఇలా…
2023 హార్నెట్ 2.0లో కొత్త 184.4 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 17 బీహెచ్‌పీ పవర్, 16ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. కొత్త 2023 హార్నెట్ 2.0 లీటరుకు 40 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నట్లు హోండా తెలిపింది.

హార్నెట్ 2.0కి యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్, సింగిల్ ఛానల్ ఏబీఎస్‌తో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, అడ్జస్టబుల్ బ్రైట్‌నెస్‌ ఆప్షన్ ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

పోటీ వీటితోనే…
హోండా హార్నెట్ 2.0 దాని విభాగంలో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180తో సహా అనేక ఇతర మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 180 కేవలం ఒక్క వేరియంట్, రెండు రంగులలో మాత్రమే అందుబాటులో ఉన్న స్ట్రీట్ బైక్. ఇది 177.4 సీసీ బీఎస్6 ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 16.78 బీహెచ్‌పీ శక్తిని, 15.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *