హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ ఇదే – బుక్ చేస్తే ఎన్నాళ్లు పడుతుందో తెలుసా?

[ad_1]

Hyundai Exter Booking: హ్యుందాయ్ మోటార్స్ తన కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్‌ను ఈ నెల 10వ తేదీన భారతదేశంలో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. ఆరు లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ ఎక్స్‌టర్‌కు సంబంధించి 16 వేలకు పైగా బుకింగ్స్ అయినట్లు వెల్లడించారు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ బుకింగ్స్ గురించి తరుణ్ గార్గ్ మాట్లాడుతూ ‘ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి రోజుకు 1,800 బుకింగ్స్ చొప్పున వస్తున్నాయి వీటిలో ఏఎంటీకి 38 శాతం, సీఎన్‌జీకి 22 శాతం, పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌కి 40 శాతం బుకింగ్‌లు జరిగాయి.’ అని చెప్పారు. అంటే ఆటోమేటిక్, మాన్యువల్ వెర్షన్‌లకు ఈక్వల్‌గా బుకింగ్స్ జరుగుతున్నాయన్న మాట.

కొత్త ఎక్స్‌టర్ కోసం వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌ను బట్టి 12 వారాల వరకు ఉంటుందని కొన్ని డీలర్ వర్గాలు ధృవీకరించాయి. ఎక్స్‌టర్ మాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు ఆరు నుంచి ఎనిమిది వారాలు, ఆటోమేటిక్ వెర్షన్ కోసం వెయిటింగ్ పీరియడ్ 10 నుంచి 12 వారాల మధ్య ఉంటుంది. ఎక్స్‌టర్ మాన్యువల్ వేరియంట్ కోసం అధిక సంఖ్యలో బుకింగ్‌లు ఉన్నాయి. అయినా ఏఎంటీ వెర్షన్‌కు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది.

వేటితో పోటీ?
టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, మారుతి సుజుకి ఇగ్నిస్‌లకు హ్యుందాయ్ ఎక్స్‌టర్ పోటీగా నిలవనుంది. మేలో ఎక్స్‌టర్ బుకింగ్‌లు ప్రారంభం అయినప్పటి నుండి పంచ్ 22,000 యూనిట్లకు పైగా అమ్ముడు పోయింది. సిట్రోయెన్ సీ3, మారుతి సుజుకి ఇగ్నిస్‌కు సంబంధించి తక్కువ యూనిట్లు అమ్ముడు పోయాయి. దాదాపు 1,500 సిట్రోయెన్ యూనిట్లు, 8,900 వరకు ఇగ్నిస్ యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ ఫీచర్లు
ఈ కారు ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) Connect అనే ఐదు ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ (స్మార్ట్ ఆటో ఏఎంటీ), 1.2 లీటర్ బై ఫ్యూయల్ కప్పా పెట్రోల్ విత్ సీఎన్‌జీ ఇంజిన్ (5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్లోకి వచ్చింది.

హ్యుండాయ్ ఎక్స్‌టర్‌లో రెండు డిస్‌ప్లేలు అందించారు. వీటిలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం మొదటిది. 4.2 అంగుళాల టీఎఫ్‌టీ మిడ్ డిస్‌ప్లే కూడా అందించారు. ఈ కారులో 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లు కూడా అందించారు. ఈ ధరల విభాగంలో మొదటిసారిగా స్మార్ట్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డ్యాష్ క్యాం ఫీచర్లతో లాంచ్ అయిన ఎస్‌యూవీ ఇదే.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. మూడు పాయింట్ల సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, కీలెస్ ఎంట్రీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో అందించారు.

Read Also: కారు డ్రైవ్ చేసేటప్పుడు సడెన్‌గా బ్రేక్స్ ఫెయిల్ అయితే – టెన్షన్ అవ్వకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *