[ad_1]
L&T at Rs.3 trn mark: లార్సెన్ & టూబ్రో (L&T) BSEలో రూ.3 ట్రిలియన్ (3 లక్షల కోట్ల రూపాయలు) మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్‌ను దాటింది. రూ.3 ట్రిలియన్ కంపెనీల ఎలైట్ క్లబ్‌లో చేరింది. దాని షేరు ధర బుధవారం ఇంట్రా-డే ట్రేడ్‌లో 2 శాతం పైగా ర్యాలీతో రూ. 2,143.45 వద్ద కొత్త 52 వారాల రికార్డ్ స్థాయిని తాకింది. రూ.3.01 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో, మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో L&T నిలిచింది.
గత నెల రోజుల్లో S&P BSE సెన్సెక్స్‌లో 2.5 శాతం పెరుగుదలతో పోలిస్తే, L&T 6 శాతం లాభపడి మార్కెట్‌ను ఔట్ పెర్ఫార్మ్ చేసింది. గత ఆరు నెలల కాలంలో 35 శాతం ర్యాలీ చేసింది. బలమైన ఆర్డర్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు దీని మీద సెంటిమెంట్ పెంచుకున్నారు.
‘V’ షేప్ రికవరీ
ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పడుతూ వెళ్లినా, అక్కడి నుంచి ‘V’ షేప్ రికవరీ తీసుకుంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగి లాభాల్లోకి వచ్చింది. 2022లో ఇప్పటి వరకు (YTD) 11 శాతం పెరిగింది.
ఇంజినీరింగ్ & కన్‌స్ట్రక్షన్‌లో దశాబ్దాల అనుభవం, పటిష్టమైన ట్రాక్ రికార్డ్ ఉన్న L&T.., ప్రభుత్వ & ప్రైవేట్ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల ఏర్పడుతున్న కాపెక్స్ అప్-సైకిల్‌లో ప్రధాన లబ్ధిదారుగా మారుతుందని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.
News Reels
టెక్నికల్ వ్యూ
బయాస్: పాజిటివ్
సపోర్ట్: రూ. 2,127; తర్వాత రూ. 2,122
రెసిస్టెన్స్: రూ. 2,153
లార్సెన్ & టూబ్రో స్టాక్ ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో స్వల్ప కాల సగటు (20-DMA) పైన నిలదొక్కుకున్న తర్వాత, అప్‌వర్డ్ జర్నీలో ఉంది. ఈ కాలంలోనే దాదాపు 15 శాతం ర్యాలీ చేసింది.
ప్రస్తుతం, డైలీ చార్ట్‌లో రూ.2,127 స్థాయి వద్ద బొలింగర్ బ్యాండ్ హయ్యర్ ఎండ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ స్టాక్ రూ. 2,127 కంటే పైన కదులుతున్నంత కాలం షార్ట్ టర్మ్ బయాస్ పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా, వీక్లీ చార్ట్ సూచీలు రూ. 2,122 స్థాయి వద్ద దీనికి సపోర్ట్‌గా ఉన్నాయి.
మంత్లీ ఫిబోనసీ చార్ట్ ప్రకారం… ఈ స్టాక్ సుమారు రూ. 2,140 నుండి రూ. 2,153 పరిధిలో గట్టి ప్రతిఘటన (రెసిస్టెన్స్) ఎదుర్కొంటుంది. దాదాపు రూ. 2,100 స్థాయిలో బలమైన మద్దతు ఉంటుందని అంచనా. రూ. 2,153 స్థాయిని దాటి, ఆపై నిలదొక్కుకోగలిగితే.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply