[ad_1]
Home Loan Above ₹75 Lakhs: మీరు రూ. 75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ గృహ రుణం తీసుకుని మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఆ గృహ రుణం ఇకపై మరింత ఖరీదైనదిగా మారవచ్చు. రూ. 75 లక్షల కంటే ఎక్కువ ఉన్న గృహ రుణాలపై తక్కువ రిస్క్ వెయిట్ రేషియో (risk weight ratio) సదుపాయం ముగిసింది, కరోనా పూర్వ స్థాయిలోని 50 శాతానికి తిరిగి చేరుకుంది. 2020 అక్టోబర్‌లో, ఆస్తి విలువలో 80 శాతం కంటే తక్కువ విలువైన రుణాలపై రిస్క్ వెయిటేజీని 35 శాతానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) తగ్గించింది. తొలుత ఈ ఆఫర్ 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంది, తర్వాత దానిని మరో ఏడాది పాటు, 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువును పొడిగించలేదు.
వివిధ విలువల్లో ఉండే గృహ రుణాల మీద రిస్క్ వెయిటేజ్ రేషియోలను నిర్ణయించారు, దాని ప్రకారమే రుణాలు ఆమోదిస్తారు.
జేబులోంచి ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది
రిస్క్ వెయిటేజ్‌లో ఇచ్చిన సడలింపును RBI పొడిగించలేదు కాబట్టి, కరోనా మహమ్మారి సమయంలో రద్దు చేసిన “రూ. 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలకు 75 శాతం విలువైన రుణం” పద్ధతిని ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చారు. దీని ప్రకారం… రూ. 75 లక్షల కంటే ఎక్కువ విలువైన గృహ రుణాలు తీసుకునేవారు 25 శాతం మార్జిన్‌ను తామే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రిస్క్ వెయిటేజీ పెరగడం వల్ల ఈ తరహా గృహ రుణంపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
‘లోన్ టు వాల్యూ’ అంటే ఏంటి?
ఏదైనా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా బ్యాంకు.. సంబంధిత ఆస్తి విలువ ఆధారంగా గృహ రుణం ఇస్తుంది. మీరు కొనబోయే ఫ్లాట్ లేదా ఇంటి ఖరీదు రూ. 50 లక్షలు అయితే, మీకు రూ. 40 లక్షల గృహ రుణం ఇవ్వాలని రుణదాత నిర్ణయించినట్లయితే, ఆస్తి విలువలో 80%కి సమానమైన గృహ రుణాన్ని బ్యాంక్ ఆమోదించిందని అర్థం. దీనినే ‘లోన్-టు-వాల్యూ’ అంటారు.
2023 ఏప్రిల్ 1 నుంచి… రూ. 30 లక్షల వరకు ఉన్న గృహ రుణం మీద లోన్-టు-వాల్యూ 80 శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే, రిస్క్ వెయిటేజ్ రేషియో 35 శాతం ఉంటుంది. ఇదే రుణంపై లోన్-టు-వాల్యూ 80-90 శాతం మధ్య ఉంటే, అప్పుడు రిస్క్ వెయిటేజ్ 50 శాతం ఉంటుంది. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య ఉన్న గృహ రుణాలకు లోన్-టు-వాల్యూ 80 శాతం వరకు ఉంటే రిస్క్ వెయిటేజీ 35 శాతంగా ఉంటుంది. రూ. 75 లక్షలకు పైబడిన గృహ రుణాలకు గృహ రుణంపై రుణం విలువ 75 శాతం, రిస్క్ వెయిటేజ్ నిష్పత్తి 50 శాతంగా ఉంటుంది. అంటే, 75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలు తీసుకున్నవారు ఆ ఆస్తి విలువలో 25 శాతాన్ని తమ సొంత జేబులో నుంచి చెల్లించవలసి ఉంటుంది.
రూ.50 లక్షల పైగా రుణాలు మూడింట ఒక వంతు
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ డేటా ప్రకారం… 2021-22లో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రూ. 2.45 లక్షల కోట్ల విలువైన గృహ రుణాల పంపిణీ జరిగింది. వీటిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ రుణాలు రూ. 50 లక్షలకు పైగా విలువైనవి. ఇప్పుడు గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో పాటే రిస్క్ కూడా పెరిగింది. అందుకే, గృహ రుణంపై తక్కువ రిస్క్ సౌకర్యాన్ని RBI ఉపసంహరించుకుంది.
[ad_2]
Source link
Leave a Reply