[ad_1]
IPOs in FY24: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial Year 2023-24) ముగింపు దశకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి పని దినం. ఈ రోజు తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే మిగిలివున్నా, ఆ మూడు రోజులు మార్కెట్‌కు సెలవు. ఈ ఆర్థిక సంవత్సరంలో, దేశీయ మార్కెట్‌లో IPO కార్యకలాపాలు చాలా చురుగ్గా సాగాయి. కొత్త ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (IPOs) సంఖ్య, పరిమాణం.. రెండింటి పరంగా ఈ ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధాన IPOలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారతీయ స్టాక్ మార్కెట్లోకి 75 IPOలు వచ్చాయి, గత రెండేళ్లలోనే ఇది అత్యధికం. FY24లో మార్కెట్ చాలా అద్భుతమైన పబ్లిక్ ఆపర్లను చూసింది. దేశంలో అతి పెద్ద కార్పొరేట్ గ్రూప్ అయిన టాటా గ్రూప్ రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మళ్లీ ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 2004లో TCS IPO మార్కెట్ తలుపు తట్టిన తర్వాత, మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా టెక్ ఆఫర్ ఓపెన్ అయింది. ఇది దాదాపు 70 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. దీంతోపాటు IREDA, JSW ఇన్‌ఫ్రా, సెల్లో వరల్డ్ వంటి ఇష్యూలు కూడా మార్కెట్‌లో విడుదలయ్యాయి, ఇవన్నీ పెట్టుబడిదార్లు ఆసక్తిగా ఎదురుచూసినవే.
ప్రైమరీ మార్కెట్ నుంచి డబ్బు పోగేసిన కంపెనీలు
2023-24లో IPOల సంఖ్య మాత్రమే కాదు, IPOల నుంచి సేకరించిన డబ్బు కూడా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన 75 ఐపీవోల ద్వారా కంపెనీలు దాదాపు రూ.62,000 కోట్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ. 61,915 కోట్లు సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23 కంటే ఈసారి 20 శాతం ఎక్కువ డబ్బు వసూలైంది. 2022-23లో 37 ఐపీఓలు మార్కెట్‌లోకి రాగా, కంపెనీలు రూ. 52,116 కోట్లు సమీకరించాయి.
కనకవర్షం కురిపించిన 50 IPOలు
ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన IPOలు స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీ నుంచి బాగా లాభపడ్డాయి. 2023-24లో, బెంచ్‌మార్క్ సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ తలో 30 శాతం మేర పెరిగాయి. ఫలితంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 75 ఐపీవోల్లో 50 ఐపీవోలు సానుకూల రాబడి ఇచ్చాయి. వీటి సగటు రాబడి 65 శాతం. మరీ ముఖ్యంగా, 5 IPOలు 150 శాతం పైగా లాభాలను పంచాయి.
మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, మార్చి 29న గుడ్ ఫ్రైడే సెలవు ఉంటుంది. ఆ తర్వాత మార్చి 30వ తేదీ శనివారం, మార్చి 31వ తేదీ ఆదివారం వస్తుంది. ఈ విధంగా వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్లు మూతపడతాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో తదుపరి ట్రేడింగ్ సెషన్ కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున (సోమవారం 01 ఏప్రిల్ 2024) ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
[ad_2]
Source link
Leave a Reply