Earth: క్రియాశీల అగ్ని పర్వతాలతో భూమిని పోలిన మరో గ్రహం.. గుర్తించిన నాసా

[ad_1]

అచ్చం భూమి (Earth) పరిమాణంలో ఉన్న ఓ నివాసయోగ్యమైన గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి ‘ఎల్‌పీ791-18 డి’గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు.. భూమి నుంచి 86 కాంతి సంవత్సరాల (Light Year) దూరంలో ఉన్నట్టు తెలిపారు. క్రేటర్‌ (Creater) అనే నక్షత్ర మండలంలోని ఓ ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ గ్రహంపై క్రియాశీల అగ్నిపర్వతాలు (Volcanoes) విస్తరించి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తల బృందం తెలిపింది. భూమితో పోలిస్తే ‘ఎల్‌పీ791-18 డి’ పరిమాణం స్వల్పంగానే ఎక్కువగానే ఉన్నా.. ద్రవ్యరాశి మాత్రం చాలా అధికంగా ఉంటుందని చెప్పింది.

ఈ గ్రహం ఎల్లప్పుడూ ఒకవైపు మాత్రమే నక్షత్రానికి అభిముఖంగా ఉంటుందని వెల్లడించింది. ఫలితంగా ఆ ప్రాంతంలో వేడి మరీ ఎక్కువగా ఉండొచ్చని.. రెండో వైపున పరిస్థితులు జీవం మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ గ్రహం బృహస్పతి (Jupiter) చంద్రుడు ‘ఐఓ’ (Moon Io) మాదిరిగా తరచుగా అగ్నిపర్వత విస్ఫోటనాలకు లోనవుతుందని నాసా తెలిపింది. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS), రిటైర్డ్ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ డేటా సాయంతో ఎల్పీ791-18డీని కనుగొన్నారు.

ఓ నిర్దిష్ట నక్షత్రం చుట్టూ తిరుగుతున్న మూడో గ్రహం అగ్నిపర్వతాలతో నిండి ఉందని, వీటిని ప్రత్యక్షంగా గమనించలేదని తెలిపారు. కానీ, ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు ఇతర పెద్ద గ్రహాలతో దాని ముఖ్యమైన గురుత్వాకర్షణ పరస్పర చర్య కారణంగా ఊహించారు. ‘LP 791-18 d ఒకవైపు మాత్రం నిరంతరం దాని నక్షత్రానికి అభిముఖంగా ఉంటుంది.. నీరు ద్రవరూపంలో ఉపరితలంపై ఉండడానికి పగటి భాగం చాలా వేడిగా ఉండొచ్చు… కానీ గ్రహం అంతటా సంభవించే అగ్నిపర్వత కార్యకలాపాలు వాతావరణాన్ని నిలబెట్టగలవని మేం భావిస్తున్నాం.. రాత్రిపూట నీరు ఘనీభవిస్తుంది’ అని అధ్యయనం సహ రచయిత జార్న్ బెన్నెకే చెప్పారు.

‘ఈ గ్రహంపై అగ్నిపర్వతాలకు సంబంధించి ప్రత్యక్ష పరిశీలనా ఆధారాలు లేవు.. కానీ దీనిపై జీవుల మనుగడకు అనూలంగా ఉండే అవకాశం ఉంది’ అని నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ ఇయాన్ క్రాస్‌ఫీల్డ్ అన్నారు. ‘ఉపరితల ఉష్ణోగ్రత భూమి కంటే కొంచెం వెచ్చగా ఉన్నట్లు కనిపిస్తుంది.. ఇది నక్షత్రం చుట్టూ నివాసయోగ్యమైన జోన్ లేదా గోల్డిలాక్స్ జోన్ అని పిలిచే లోపలి అంచున ఉంది.. అంత వేడిగా, అంత చల్లగా ఉండదు.. బహుశా ఉపరితలంపై నీటిని ద్రవరూపంలో ఉంచగలదు’అని తెలిపారు.


Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *