[ad_1]
ప్రతీ అర్ధగోళానికి ఒకసారి చొప్పున వేసవి కాలం సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ రోజుల్లో భూమి ధ్రువాలలో ఒకటి సూర్యుని వైపు గరిష్టంగా వంగి ఉంటుంది. కాబట్టి, జూన్ 21 ఉత్తరార్ధగోళానికి పగటిపూట ఎక్కువ కాలం ఉండే రోజు. దక్షిణార్ధ గోళంలో (Southern Hemisphere) ఈ రోజు అతి తక్కువ పగటి వెలుతురు ఉంటుంది.
కొన్ని దేశాల్లో సమ్మర్ సోల్స్టైస్ రాకతో వసంత రుతువు ముగిసి, వేసవి కాలం మొదలవుతుంది. శరదృతువు విషువత్తుతో (Autumnal Equinox) అంటే పగలు, రాత్రి సమంగా ఉండే రోజు. ఇది సెప్టెంబరు 23న జరుగుతుంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టు తిరిగే క్రమంలో ‘సమ్మర్ సోల్స్టైస్’ ఏర్పడుతుంది.
భూమి ఒక పక్కకు వంగి తిరిగే విషయం తెలిసిందే. అలా వంగి తిరిగే సమయంలో ఉత్తర లేదా దక్షిణ ధ్రువాలు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చేటప్పుడు పగటి కాలాల్లో మార్పులు వస్తాయి. ఉత్తరార్ధ గోళం సూర్యుడికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు సమ్మర్ సోల్స్టైస్ మొదలవుతుంది. అంటే ఆ రోజున ఉత్తరార్ధ గోళంలో పగటి కాలం ఎక్కువ సేపు ఉంటుంది.
ఈ రోజున నార్వే, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, అలస్కా సహా మరికొన్ని ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తాడు. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించకపోవడం మరో విశేషం. భూమి ఒకవైపునకు వంగి తిరగడమే దీనికి కారణం.
సమ్మర్ సోల్స్టైస్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్లో సోల్ అంటే సూర్యుడు. సిస్టెస్ అంటే కదలకుండా ఉండటం. ఇక, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల సమ్మర్ సోల్స్టైస్ వేడుకలు చేసుకుంటారు. బ్రిటన్ వాసులు స్టోన్హెంజ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. 4000 సంవత్సరాల నుంచి ఇదొక ప్రార్థనా స్థలంగా గుర్తింపు పొందింది. సమ్మర్ సోల్స్టైస్ రోజున స్టోన్హెంజ్లోని మధ్యనుండే భారీ రాయి (సెంట్రల్ ఆల్టార్ స్టోన్) నీడ హీల్ స్టోన్ నీడతో కలుస్తుంది. సూర్యుడు ఈశాన్య దిక్కున ప్రకాశిస్తాడు. దీన్ని చూడటానికి పెద్దయెత్తున ప్రజలు వస్తుంటారు.
స్వీడన్ వాసులు వేసవికి స్వాగత వేడుకలు జరుపుకుంటారు. పూలతో అలంకరించబడిన కర్రల చుట్టూ గుమిగూడి పాటలు పాడుతూ నృత్యాల చేస్తూ వేసవిని ఆహ్వానిస్తారు. ఈ రోజు స్వీడన్లో అధికారిక సెలవు దినం. ఐస్లాండ్లో 24 గంటల పగటి వెలుతురు కాబట్టి అక్కడ సమ్మర్ సొల్స్టైస్ను మిడ్నైట్ సన్ అని పిలుస్తారు. రష్యన్లు సంగీత కచేరీలు, జలకాలాటలతో వేడుకలు చేసుకుంటారు.
ఈ రోజున ఉత్తరార్ధ గోళంలోని కర్కాటక రేఖపై సూర్య కిరణాలు నిట్టనిలువుగా ప్రకాశించడంతో వల్ల 23 1/2 డిగ్రీల అక్షాంశాలకు పైనుండే ప్రాంతాల్లో అసలు రాత్రే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాంతాలు సూర్యుడికి అత్యంత సమీప దూరంలోకి వస్తాయి. ఉత్తరార్ధ గోళంలో సమ్మర్ సోల్స్టైస్ వచ్చినప్పుడు, దక్షిణార్ధ గోళంలో వింటర్ సోల్స్టైస్ వస్తుంది. అంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం మొదలవుతుంది. నార్వేలో వేసవి కాలం వేడుకలను స్లిన్నింగ్స్బాలెట్ అని పిలుస్తారు. జాన్ ది బాప్టిస్ట్ జ్ఞాపకార్థం భోగి మంటలు వెలిగిస్తారు. వారి నమ్మకాల ప్రకారం.. ఈ మంటలు గాలిలోని దుష్ట ఆత్మల ప్రక్షాళన చేస్తాయి.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply