[ad_1]
News
oi-Bhusarapu Pavani
మైక్రోసాఫ్ట్
అధినేతగా
బిల్
గేట్స్
ఎంతో
ఫేమస్.
దీనికి
తోడు
బిల్
&
మిలిండా
గేట్స్
ఫౌండేషన్
పేరిట
తన
సంపదలో
పెద్ద
మొత్తాన్ని
పలు
దాతృత్వ
కార్యకాలాపాలకు
ఖర్చు
చేస్తూ
ఎనలేని
ప్రఖ్యాతి
సంపాదించారు.
అయితే
ఈమధ్య
వివిధ
వివాదాలకు
ఆయన
కేరాఫ్
అడ్రస్
గా
మారుతున్నారు.
బిల్
గేట్స్
ప్రైవేట్
కార్యాలయంలో
ఉద్యోగం
కోసం
దరఖాస్తు
చేసుకున్న
మహిళలను
ఇబ్బందులకు
గురిచేస్తున్నట్లు
నివేదికలు
చెబుతున్నాయి.
ఇంటర్వ్యూలో
అసభ్యకరమైన,
వివాహేతర
సంబంధాల
గురించి
క్వశ్చన్
చేస్తున్నట్లు
ప్రముఖ
అమెరికన్
మీడియా
న్యూయార్క్
పోస్ట్
వెల్లడించింది.
అశ్లీల
చిత్రాలు
వీక్షిస్తారా,
మొబైల్
లో
నగ్న
చిత్రాలు
ఏవైనా
ఉన్నాయా
అంటూ
ప్రశ్నించినట్లు
పేర్కొంది.
డబ్బు
కోసం
ఎప్పుడైనా
డ్యాన్స్
చేశారా
అని
తనను
అడిగినట్లు
ఓ
బాధితురాలు
వాల్
స్ట్రీట్
జర్నల్‌కు
తెలిపింది.
లైంగికంగా
సంక్రమించే
వ్యాధులు
గతంలో
ఏమైనా
వచ్చాయా
అని
నిర్మొహమాటంగా
ఆమెను
అడిగారట.
అయితే
పురుష
అభ్యర్థులకు
మాత్రం
ఈ
తరహా
అభ్యంతరకర
ప్రశ్నలు
ఎదురు
కాలేదని
తెలిసింది.
ఈ
ఆరోపణలను
గేట్స్
ప్రతినిధి
ఖండించారు.
తమ
15+
ఏళ్ల
చరిత్రలో..
ఇంటర్వ్యూలో
అనుచిత
ప్రశ్నలు
అడుగుతున్నారని
ఎవరూ
ఆరోపించలేదని
తెలిపారు.
హై-ప్రొఫైల్
క్లయింట్‌లకు
కార్యాలయ
భద్రతను
అందించడంలో
ప్రత్యేకత
కలిగిన
కాన్సెంట్రిక్
అడ్వైజర్స్
అనే
థర్డ్-పార్టీ
కాంట్రాక్టర్
ఇంటర్వ్యూ
నిర్వహించినట్లు
వెల్లడించారు.
ఈ
తరహా
ప్రశ్నలు
ఆమోదయోగ్యం
కావని,
ఇలా
చేయడం
గేట్స్
వెంచర్స్‌తో
ఒప్పందాన్ని
ఉల్లంఘించడమేనని
WSJకి
వివరించారు.
English summary
Women applicants for job in Bill Gates private office were abused with unacceptable questions
Women applicants for job in Bill Gates private office were abused with unacceptable questions
Story first published: Friday, June 30, 2023, 18:02 [IST]
[ad_2]
Source link
Leave a Reply