[ad_1]
HDFC Bank:
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ (HDFC Bank) జూన్ త్రైమాసికం అప్డేట్ ఇచ్చింది. ఏకీకృత, విలీన సంస్థల గణాంకాలను విడుదల చేసింది. బ్యాంకు రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. ఇక హెచ్డీఎఫ్సీ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు రుణాలు వార్షిక ప్రాతిపదికన 13 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
‘జూన్ త్రైమాసికంలో బ్యాంకు రుణాలు రూ.16,15,500 కోట్లుగా ఉన్నాయి. 2022, జూన్ 30 నాటి రూ.13,95,100 కోట్లతో పోలిస్తే ఇది 15.8 శాతం వృద్ధి. ఇక 2023, మార్చి 31 నాటి రూ.16,00,600 కోట్లతో పోలిస్తే 0.9 శాతం వృద్ధి నమోదైంది’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల బదిలీల ద్వారా జరిగిన అంతర్ బ్యాంకు, డిస్కౌంటెడ్ బిల్స్ వల్ల బ్యాంకు రుణాలు వార్షిక ప్రాతిపదికన 20.2 శాతం పెరిగాయి. కాగా మార్చి 31తో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల.
జూన్ 30 నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్లు రూ.19,13,00 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో డిపాజిట్లు రూ.16,04,800 కోట్లు కావడం గమనార్హం. 2023, మార్చి 31 నాటి రూ.18,83,400 కోట్లతో పోలిస్తే 1.6 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ డిపాజిట్లు రూ.38,000 కోట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2.5 శాతం లేదా వార్షిక ప్రాతిపదికన 21.5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం డిపాజిట్లు ఇయర్ ఆన్ ఇయర్ 9 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2.5 శాతం వృద్ధి నమోదైంది.
Also Read: ఈ ఎక్స్పర్ట్ చెప్పేది వింటే! పొరపాటున కూడా ఐటీ షేర్ల జోలికి వెళ్లరు!
స్థానిక రుణాలు 20 శాతం పెరిగాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 29 శాతం ఎగిశాయని పేర్కొంది. కార్పొరేట్ రుణాలు 11 శాతం పెరిగాయి. కాసా డిపాజిట్లు జూన్ 30 నాటికి రూ.8,13,000 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలోని రూ.7,34,600 కోట్లతో పోలిస్తే 10.7 శాతం వృద్ధి నమోదైంది. అయితే మార్చి ముగింపు నాటి రూ.8,36,000 కోట్లతో పోలిస్తే 2.7 శాతం తగ్గాయి. రిటైల్ కాసా రుణాలు వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరగ్గా త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తగ్గింది.
మొత్తం హెచ్డీఎఫ్సీ ఫలితాలు వార్షిక ప్రాతిపదికన మెరుగ్గానే అనిపించినా త్రైమాసికం ప్రకారం అంచనాలను అందుకోలేదు. దాంతో బుధవారం మధ్యాహ్నం బ్యాంకు షేర్లు 2.89 శాతం తగ్గాయి. రూ.49 నష్టంతో రూ.1678 వద్ద కొనసాగుతున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
India’s No. 1 Private Sector Bank & India’s No. 1 Home Loans Company have merged to join the ranks of the world’s leading financial institutions.
On this momentous occasion, we rededicate ourselves to serve those who made this milestone possible – You, our Customer.#HDFCBank… pic.twitter.com/0IUzP9L2Oc
— HDFC Bank (@HDFC_Bank) July 1, 2023
[ad_2]
Source link
Leave a Reply