[ad_1]
Income Tax Return: ఇన్కమ్ టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
We are happy to inform that over 2 crore Income Tax Returns (ITRs) for AY 2023-24 have already been filed till 11th of July this year as compared to 2 crore ITRs filed till 20th of July last year.
Our taxpayers have helped us reach the 2 crore milestone 9 days early this year,… pic.twitter.com/ZlOAKeJpWR
— Income Tax India (@IncomeTaxIndia) July 11, 2023
ఆదాయపు పన్ను విభాగం ట్వీట్
ఇప్పటి వరకు దాఖలైన ఆదాయ పన్ను పత్రాలపై ఆదాయ పన్ను విభాగం ట్వీట్ చేసింది. “2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి, ఇప్పటి వరకు (జులై 11, 2023) వరకు మొత్తం 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే, 2022 జులై 20 నాటికి 2 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేయగలిగారు. ఈ ఏడాది 9 రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య బాగుంది. పన్ను చెల్లింపుదార్ల కృషిని మేం అభినందిస్తున్నాం” అని ట్వీట్లో పేర్కొంది.
2023-24 అసెస్మెంట్ ఇయర్‌కు ఇంకా ఐటీఆర్ సమర్పించని వాళ్లు వీలైనంత త్వరగా ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను విభాగం కోరింది. తద్వారా, చివరి నిమిషంలో రద్దీని నివారించవచ్చని చెప్పింది. టాక్స్ పేయర్‌కు పెట్టుబడులు లేకపోయినా సెక్షన్ 80C కింద డిడక్షన్స్ పొందడం, ఎక్కడా విరాళాలు ఇవ్వకపోయినా సెక్షన్ 80G కింద వాటిని చూపించడం సహా తప్పుడు మార్గాల్లో మినహాయింపులు పొందాలని ప్రయత్నించొద్దని ఐటీ డిపార్ట్మెంట్ సూచించింది. మోసపూరిత విధానం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించింది. తప్పుడు లెక్కలు చూపి టాక్స్ లయబిలిటీ తగ్గించినా & రిఫండ్ పొందినా, స్క్రూటినీలో బయటపడితే ఆ డబ్బంతా భారీ పైన్‌తో కలిపి తిరిగి చెల్లించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ కొండ ఎక్కుతున్న పసిడి – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
12 రోజుల ముందే 1 కోటి ITRలు
2023-24 అసెస్మెంట్ ఇయర్ ITR ఫైలింగ్స్ ఒక కోటి మైల్స్టోన్ చేరుకున్నప్పుడు కూడా, దాని గురించి ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది. ఈ ఏడాది జూన్ 26 నాటికి కోటి మంది పన్ను చెల్లింపుదార్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో, 2022 జులై 8 నాటికి ఒక కోటి నంబర్ కనిపించింది. అంటే, 2022తో పోలిస్తే 2023లో ఒక కోటి ITRల మైలురాయిని 12 రోజుల ముందే చేరుకున్నట్లయింది.
ITR ఫైలింగ్ లాస్ట్ డేట్ జూలై 31
2023-24 అసెస్మెంట్ ఇయర్లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. ఈ నెలలో దాదాపు సగ భాగం పూర్తయింది. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా ITRలు ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను విభాగం తరచూ గుర్తు చేస్తోంది.
మరో ఆసక్తికర కథనం: బైజూస్‌కు మరో షాక్, అకౌంట్ బుక్స్‌పై ఫోకస్ పెట్టిన కేంద్రం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply