మిడ్ రేంజ్ ఎస్‌యూవీ మార్కెట్లో ఫేస్‌లిఫ్ట్ కార్ల హవా – ఈ రెండు కార్లపై భారీ అంచనాలు!

[ad_1]

Kia Seltos Facelift and Hyundai Creta Facelift: హ్యుందాయ్, కియా కంపెనీలు మిడ్ రేంజ్ ఎస్‌యూవీ విభాగంలో భారతీయ మార్కెట్లో చాలా బలమైన పట్టును కలిగి ఉన్నాయి. 2023 ప్రథమార్థంలో ఈ రెండు కంపెనీల కార్లు మొత్తం మార్కెట్లో 53 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం. మారుతి, టయోటా ఈ విభాగంలో 32 శాతం వాటాతో ఉన్నాయి.

కియా ఇండియా ఇప్పటికే ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దానికి సంబంధించిన బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు ధరలను త్వరలో ప్రకటించనున్నారు. హ్యుందాయ్ క్రెటా రెండో తరం మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. 2024 ప్రారంభంలో దీన్ని మళ్లీ అప్‌డేట్ చేయనున్నారు.

2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంది?
కొత్త సెల్టోస్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే మొదటి రోజు 13,424 ఆర్డర్‌లు వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో ఇది రికార్డు నంబర్. వీటిలో 1,937 బుకింగ్‌లు కె-కోడ్ ద్వారా వచ్చాయి. అంటే ఇప్పటికే ఉన్న సెల్టోస్ కస్టమర్‌లకు ప్రత్యేకంగా అందించిన కోడ్‌ల ద్వారా వచ్చాయన్న మాట. డెలివరీల్లో వీటికే ప్రయారిటీని ఇవ్వనున్నారు.

2023 కియా సెల్టోస్ టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్-లైన్‌తో సహా మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. టెక్ లైన్ ఐదు వేరియంట్‌లను (HTE, HTK, HTK+, HTX, HTX+) పొందగా, జీటీ లైన్, ఎక్స్ లైన్ ఒక్కో ట్రిమ్‌ను పొందుతాయి. జీటీ, ఎక్స్ లైన్‌ మోడళ్లకు ఏడీఏఎస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

కొత్త సెల్టోస్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ త్వరలో
2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ టెస్టింగ్ ఇప్పటికే భారతదేశంలో ప్రారంభమైంది. ఇది ఏడీఏఎస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరాతో పాటు కియా సెల్టోస్ మాదిరిగానే అనేక ఇతర కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని డిజైన్, స్టైలింగ్‌లో కూడా చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. దీనిలో క్యూబ్ తరహా డిటైలింగ్, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో కూడిన పాలిసేడ్ ఇన్‌స్పైర్డ్ గ్రిల్‌ను చూడవచ్చు.

ఇది వెర్నా తరహాలో ముందు వైపు ఫుల్ వైడ్ ఎల్ఈడీ లైట్ బార్, వెనుక వైపున అప్‌డేట్ చేసిన టెయిల్‌గేట్, ఎల్ఈడీ లైట్ బార్, అప్‌డేట్ చేసిన బంపర్‌తో పెయిర్ అయిన కొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను పొందుతుంది. 2024 హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్‌ల్లో రానుంది. ఇందులో 115 బీహెచ్‌పీ పవర్‌తో నడిచే 1.5 లీటర్ పెట్రోల్, 160 బీహెచ్‌పీ పవర్ ఉన్న 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 115 బీహెచ్‌పీ పవర్ ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *