ఐటీ నోటీసు వచ్చిందని వణికిపోవద్దు! ముందు ఈ పని చేయండి!

[ad_1]

Income Tax: 

ఆదాయపన్ను శాఖ నోటీసులు అనగానే చాలా మంది జంకుతారు! ఎందుకు పంపించారు? ఏ సమాచారం అడుగుతున్నారు? ఎంత గడువు ఇచ్చారు? ఇలాంటివేమీ తెలుసుకోకుండానే ఆందోళన చెందుతారు. కొందరైతే తమను జైల్లో పెడతారేమోనని భయపడుతుంటారు. ఆంధ్రా, తెలంగాణలో రీసెంటుగా వందల మందికి ఇలాంటి నోటీసులు రావడం కలకలం సృష్టించింది. అందుకే అసలు నోటీసులు వస్తే ఏం చేయాలి? ఎలా సరిదిద్దుకోవాలో మీకోసం!

ఆదాయపన్ను శాఖ (IT Department) నుంచి నోటీసులు రాగానే ముందు చేయాల్సిన పని ఒకటుంది! అదే ఆ నోటీసులు క్షుణ్ణంగా చదవి అర్థం చేసుకోవడం. ఆదాయపన్ను చట్టంలోని (Income Tax Act) వివిధ సెక్షన్లను అనుసరించి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. ఇందులో అదనపు పత్రాలు సమర్పించడం నుంచి రీఆడిటింగ్‌ వరకు ఉంటాయి. అందుకే ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చిందంటే మీరు తప్పు చేసిన్టటేమీ కాదు. రొటీన్‌ కమ్యూనికేషన్‌ కూడా అవ్వొచ్చు. ఏదేమైనా నోటీసులు సకాలంలో సరిగ్గా స్పందించడం ముఖ్యం. ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోతే అనవసరంగా సమస్య పెద్దది చేసుకున్నట్టు అవుతుంది. దాంతో మీరు జరిమానా, అదనపు పన్నులు, వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చే. కొన్నిసార్లు జైలు శిక్షకు గురవుతారు.

ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు (IT Notices) వచ్చాయ మీరు అర్థం చేసుకోండి. అందులోని నిర్దేశించిన గడువులోపే స్పందించండి. విషయం అర్థమవ్వకపోతే నిపుణులను సంప్రదించండి. అడిగిన అంశానికి సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఐటీఆర్‌ ఫైలింగు (ITR Filing) పొరపాటుపై నోటీసు వస్తే సరిదిద్దుకోవడానికి ఇదే అవకాశంగా గుర్తించండి. గడువు తీరితే ఐటీ శాఖకు అప్పీల్‌ చేసుకోండి. 

ఐటీ శాఖ చాలా అంశాలపై నోటీసులు పంపిస్తుంటుంది. టాక్స్‌ రిటర్నుకు సంబంధించి మరింత సమాచారం అడగొచ్చు. మీ టాక్స్‌ రిటర్ను ఆడిట్‌ కోసం నోటీసు ఇవ్వొచ్చు. నిబంధనలను ఉల్లంఘించినట్టు భావిస్తే పెనాల్టీ నోటీసులు వస్తాయి. మీరు ఒకవేళ కట్టాల్సిన దానికన్నా తక్కువ పన్ను చెల్లిస్తే అదనపు పన్నులు చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ కోరుతుంది. చెల్లించని మొత్తానికి వడ్డీలు కోరుతుంది. కొన్ని కేసుల్లో మాత్రం క్రిమినల్‌ ప్రాసిక్యూషన్ ఉంటుంది. 

Troubles in Filing ITR: మీరు ఇప్పటికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆదాయ పన్ను లెక్కలు సబ్మిట్‌ చేయడానికి కేవలం కొన్ని రోజులు సమయం మాత్రమే మిగిలుంది. ప్రస్తుత సీజన్‌లో ఐటీఆర్‌ ఫైలింగ్ గడువు (ITR Filing Deadline)  31 జులై 2023తో ముగుస్తుంది. ఈలోగా మీరు టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Revised ITR Filing: ప్రస్తుతం, ఇన్‌టాక్స్‌ రూల్స్‌ కఠినంగా ఉన్నాయి. టాక్స్‌ పేయర్ తన పన్ను బాధ్యత నుంచి తప్పించుకోకుండా, తప్పుడు క్లెయిమ్స్‌ చేయకుండా ఐటీ డిపార్ట్‌మెంట్‌ చాలా గట్టి చర్యలు తీసుకుంటోంది. అలాగే, డిపార్ట్‌మెంట్‌ నుంచి రావలసిన రిఫండ్‌ తక్కువగా వచ్చినా, దానిపై అప్పీల్‌ చేయడానికి కూడా అనుమతి ఇస్తోంది. దీనికి సంబంధించి ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లో రూల్‌ ఉంది.

Also Read: టాప్‌ 10 ఐటీ కంపెనీలు – 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *