[ad_1]
Tips To reduce uric acid: ప్రస్తుతం చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి స్ఫటికాలుగా కీళ్లలోనూ, కీళ్ల చుట్టూ ఉండే కణజాలంలో చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఇది గౌట్‌కు దారితీస్తుంది. అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగానూ యూరిక్ సమస్య ఎదురవుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. అనేక తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుదల శరీరంలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను సృష్టించి, అన్ని అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. దీనికారణంగా గుండె, కాలేయం, గాల్ బ్లాడర్, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
[ad_2]
Source link
Leave a Reply