[ad_1]
ఈ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో (ISRO) అన్ని ఏర్పాట్లూ చేసింది. జాబిల్లిపై అన్వేషణకు భారత్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియెట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా నిలుస్తుంది. అంతేకాదు, ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగానూ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో నింగి నుంచి విజయగీతిక వినాలని యావత్ భారతావనితో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనుండగా.. ఇది 20 నిమిషాల పాటు కొనసాగనుంది. ల్యాండింగ్ సమయంలో నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైంది. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో తాజా ప్రయోగాన్ని నిర్వహించింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రమ్ ల్యాండర్.. ల్యాండింగ్ సమయంలో ఉపరితలం వైపు సెకనుకు 1.68 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.
విక్రమ్ ల్యాండర్ తనంతట తానుగా ఇంజిన్లు మండిస్తూ వేగాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలానికి దాదాపుగా అడ్డంగా ఉంటుంది. దీనిని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. తర్వాత కొన్ని విన్యాసాలతో ల్యాండర్ నిలువుగా ప్రయాణిస్తుంది. దీంతో ‘ఫైన్ బ్రేకింగ్ దశ’ ప్రారంభమవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. చంద్రుని ఉపరితలం నుంచి 800 మీటర్ల ఎత్తులో క్షితిజ సమాంతర, నిలువు వేగాలు రెండూ సున్నాకి వస్తాయి.
విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ స్ట్రిప్‌ను సర్వే చేస్తూ చంద్ర ఉపరితలంపై కదులుతుంది. ల్యాండర్ 150 మీటర్ల దూరం వద్ద మరోసారి ఆగి.. ఏదైనా ప్రమాదం ఉందా? ల్యాండింగ్ సైట్ అనుకూలమేనా? అని నిర్దారించుకోడానికి కెమెరాలతో ఫోటోలను తీస్తుంది. తర్వాత కేవలం రెండు ఇంజన్లు మండించడంతో చంద్రుని ఉపరితలాన్ని తాకుతుంది. విక్రమ్ కాళ్లు గరిష్టంగా సెకెనుకు 3 మీ లేదా గంటకు 10.8 కి.మీ వేగాన్ని తట్టుకునేలా రూపొందించారు. కింది భాగాల్లోని సెన్సార్లు చంద్రుని ఉపరితలంపై దిగిన వెంటనే 20 నిమిషాల భీభత్సానికి ముగింపు పలికి ఇంజన్లు ఆగిపోతాయి.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply