[ad_1]
Stock Market Today, 28 September 2023: యూఎస్ మార్కెట్ ఓవర్‌నైట్ ఫ్లాట్‌గా ముగిసింది. ఈ ఉదయం నికాయ్ 0.7 శాతం క్షీణించగా, తైవాన్ 0.5 శాతం పెరిగింది. ఇవాళ ఉదయం 8.30 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 4 పాయింట్లు లేదా 0.02 శాతం రెడ్ కలర్‌లో 19,820 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
జీ ఎంటర్‌టైన్‌మెంట్: విలీనమైన సోనీ సంస్థతో సహా నాలుగు జీ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించకుండా నిషేధించిన మార్కెట్ రెగ్యులేటర్ ఉత్తర్వులపై పునీత్ గోయెంకా దాఖలు చేసిన అప్పీల్‌పై, ‘సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్’ (SAT) తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. నవంబర్‌లోగా విచారణ పూర్తి చేస్తామని సెబీ తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
అదానీ పోర్ట్స్: 2024కి చెల్లించాల్సిన 195 మిలియన్ డాలర్ల డెట్ నోట్లను వాటి ఇష్యూ ధరపై తగ్గింపుతో తిరిగి కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబరు 11 నాటికి టెండర్ చేసిన రుణానికి, కంపెనీ ప్రతి 1,000 డాలర్లకు 975 డాలర్లు చెల్లిస్తుంది. ఆ తర్వాత ఆఫర్ ప్రైస్ 1,000కు 965కు పడిపోతుంది.
అపోలో హాస్పిటల్స్: ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, కోల్‌కతాలో పాక్షికంగా నిర్మించిన ఆసుపత్రిని రూ.102 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇన్ఫోసిస్: కోబాల్ట్ ఎయిర్‌లైన్ క్లౌడ్‌ను ఇన్ఫోసిస్ ప్రారంభించింది. ఇది, వాణిజ్య విమానయాన సంస్థలకు వారి డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడంలో సాయం చేయడానికి రూపొందించిన మొట్టమొదటి ఇండస్ట్రీ క్లౌడ్ ఆఫర్.
టెలికాం స్టాక్స్: ట్రాయ్ డేటా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన రిలయన్స్ జియో, జూలైలో 39.1 లక్షల మంది వినియోగదార్లను యాడ్ చేసుకుంది.; భారతీ ఎయిర్‌టెల్ 15.2 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోగా, వొడాఫోన్ ఐడియా 13.2 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. ఇప్పుడు జియో మార్కెట్ వాటా 38.6 శాతంగా ఉండగా, వొడాఫోన్ ఐడియా 19.9 శాతంగా ఉంది.
టాటా పవర్: ఈ కంపెనీ పునరుత్పాదక శక్తి విభాగం తమిళనాడులోని తూత్తుకుడిలో 41 మెగావాట్ల (MW) క్యాప్టివ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించాలని యోచిస్తోంది. దీనివల్ల, తిరునెల్వేలిలో ఉన్న TP సోలార్ నిర్మించబోయే 4.3-గిగావాట్ (GW) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్‌కు సేవలు అందుతాయి.
డిక్సన్ టెక్నాలజీస్: ఈ కంపెనీ యూనిట్ అయిన ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు & సంబంధిత ఉత్పత్తులను తయారు చేయడానికి జియోమీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ONGC, MRPL: ఓఎన్‌జీసీ, ఎంపీఆర్‌ఎల్‌తో ముడి చమురు విక్రయ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దాని ముంబై హై ఫీల్డ్స్ నుంచి ముడి చమురును మార్చి 2024 వరకు విక్రయిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి – రెనోవేషన్ లోన్ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్ ఇవిగో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply