గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

[ad_1]

India GDP Growth: భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు తమ అంచనాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటాయి. ఇదే కోవలో, కీలక అంతర్జాతీయ సంస్థ అయిన ప్రపంచ బ్యాంక్ (World Bank) కూడా భారత ఆర్థిక వ్యవస్థ మీద తన అంచనాలను ప్రకటించింది. 

భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తికి ‍(Gross Domestic Production – GDP‌) సంబంధించిన తన గత అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి, భారత GDP వృద్ధి అంచనాను 6.9 శాతానికి పెంచింది. ప్రపంచ ప్రతికూల పరిణామాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

రెండు సార్లు అంచనాలు తగ్గింపు
భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి అంచనాను ఈ ఆర్థిక సంవత్సరంలో వెంటవెంటనే రెండు సార్లు తగ్గించింది ప్రపంచ బ్యాంకు. మన దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఈ ఏడాది అక్టోబర్‌లో అంచనా వేసింది. దీని కంటే ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. కరోనా సంబంధింత ఇబ్బందులు, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ప్రభావం ఇందుకు కారణం. ఇప్పుడు మళ్లీ వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల విషయంలో ఇది చాలా సానుకూల పరిణామం.

రెండవ త్రైమాసికంలో అంచనాల కంటే మెరుగ్గా GDP
భారతదేశానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా ఆర్థిక నివేదికలో చాలా సానుకూల అంశాలను ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థ పోరాటపఠిమ కొనసాగుతోందని, రెండో త్రైమాసికంలో (2022 జులై- సెప్టెంబర్‌ కాలం) GDP గణాంకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. దీని కారణంగా మొత్తం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను పెంచుతున్నట్లు తెలిపింది.

News Reels

ఇటీవలి GDP గణాంకాలు
గత ఆర్థిక సంవత్సరంలో (FY22 లేదా 2021-22) భారతదేశ GDP వృద్ధి రేటు 8.7 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం చొప్పున వృద్ధి చెందింది. ‘అమెరికా, యూరో జోన్‌ మీద మాంద్యం నీడలు, చైనాలో అమలు చేస్తున్న జీరో కొవిడ్‌ విధానం వల్ల ఉత్పన్నమైన పరిణామాల ప్రభావం భారత్‌పై కూడా కనిపిస్తోంది’ అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

ద్రవ్యోల్బణం రేటుపై ప్రపంచ బ్యాంకు అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు లక్ష్యమైన 6.4 శాతానికి భారత్‌ చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ద్రవ్యోల్బణం రేటు 7.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ఇతర ప్రముఖ సంస్థల అంచనాలు
ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో, మూడీస్ (Moody’s) కూడా 2022కి భారత GDP వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7.7% నుంచి 7%కు తగ్గించింది. నవంబర్ 27న, రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ & పూర్ (Standard & Poor) తన అంచనాను గత అంచనా 7.3% నుంచి 7%కు తగ్గించింది. క్రిసిల్‌ (CRISIL) కూడా 7.3% నుంచి 7%కు తగ్గించింది. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *