రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్‌ – ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి

[ad_1]

Rupee Value Against Dollar Today: ఫారెక్స్‌ రింగ్‌లో అమెరికన్‌ డాలర్‌ బలం ముందు రూపాయి నిలబడలేకపోతోంది, రోజురోజుకూ నీరసపడుతోంది. ఈ రోజు (మంగళవారం, 05 డిసెంబర్‌ 2023), డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరోమారు జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. 

ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌లో, రూపాయి తన జీవిత కాల కనిష్ట స్థాయి (Rupee hits all-time low against Dollar) రూ.83.41కి చేరుకుంది. ఇందులో, ప్రారంభ ట్రేడింగ్‌లోనే 3 పైసల పతనం నమోదైంది.  

దిగుమతిదార్ల నుంచి భారీ డిమాండ్ కారణం
దేశంలోకి దిగుమతులు పెరుగుతున్నాయి. చెల్లింపుల కోసం వాళ్లకు డాలర్లు కావాలి. ఈ నేపథ్యంలో, దేశీయ దిగుమతిదార్ల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ కారణం వల్లే రూపాయి క్షీణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రేపటి (బుధవారం) నుంచి ద్రవ్య విధానాన్ని సమీక్షించడం ప్రారంభిస్తుంది, సమావేశం ఫలితం శుక్రవారం ‍వెలువడుతుంది.‌ డాలర్లకు డిమాండ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం. 

రూపాయి క్షీణత శుక్రవారం (08 డిసెంబర్‌ 2023) వరకు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళనలో ఉన్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారి 83.50 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు.

నిన్నటి (సోమవారం) ట్రేడింగ్‌లో కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది, రూ. 83.38 వద్ద ముగిసింది. మరోవైపు, అమెరికా నుంచి కీలక ఆర్థిక డేటా కూడా విడుదల కావల్సి ఉంది, రూపాయి విలువపై అది స్పష్టమైన ప్రభావం చూపుతుంది. 

ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో US డాలర్ స్థితిని ప్రతిబింబించే డాలర్ ఇండెక్స్ 103.62 స్థాయి వద్దకు చేరింది, 0.09 శాతం క్షీణించింది. 

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ (Brent Crude Price Today) ఫ్యూచర్స్‌ కూడా 0.05 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.99 డాలర్ల వద్దకు చేరింది. 

స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs Data) సోమవారం రూ. 2,073.21 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నెట్‌ సెల్లర్స్‌గా ఉన్న ఎఫ్‌ఐఐలు, నవంబర్‌ నెలలో నెట్‌ బయ్యర్స్‌గా టర్న్‌ అయ్యారు. అదే పంథా డిసెంబర్‌ ప్రారంభంలోనూ కొనసాగుతోంది.

డిసెంబర్ 6 నుంచి RBI MPC మీటింగ్‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం డిసెంబర్ 6 నుంచి ప్రారంభం అవుతుంది, డిసెంబర్ 8న (శుక్రవారం) ముగుస్తుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ శుక్రవారం రోజున మీడియా ముందుకు వస్తారు, MPC భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తారు. ఇప్పుడు అందరి చూపు రెపో రేటుపైనే (RBI Repo Rate) ఉంది. అయితే, ద్రవ్యోల్బణం రేటు 5 శాతం దిగువకు పడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో, తన స్టాండ్‌లో RBI ఎటువంటి మార్పు చేయకపోవచ్చు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు MPC సమావేశాలు జరిగాయి. ఆ నాలుగు సమావేశాల్లోనూ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.

మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్‌ ఆఫర్‌, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్‌!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *