57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం – అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?

[ad_1]

Smallest Budget Speech of Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ముందు కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  (Nirmala Sitharaman) గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ – 2024ను (Interim Budget 2024) ప్రజల ముందు ఉంచారు. అయితే, నిర్మలమ్మ కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని (Budget Speech) ఆమె గంటలోపే అంటే 57 నిమిషాల్లోనే ముగించారు. కాగా, ఆమె ఇప్పటివరకూ చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి తక్కువ సమయం. తన ప్రసంగంలో 5,246 పదాలను ఉపయోగించారు.

అదే సుదీర్ఘ ప్రసంగం

పార్లమెంటులో ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు సైతం నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఆమె ఏకంగా 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు ప్రసంగించారు. అయితే, ఆ సమయంలో ఆమె ఒంట్లో నలతగా ఉండడంతో మరో 2 పేజీలు మిగిలుండగానే ప్రసంగాన్ని ముగించారు. కాగా, దేశ బడ్జెట్ చరిత్రలో అదే ఇప్పటివరకూ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా కొనసాగుతోంది. 2019 – 20 బడ్జెట్ లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతి పెద్ద బడ్జెట్ స్పీచ్ గా నిలిచింది. గతేడాది నిర్మలమ్మ 86 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం వినిపించారు.

Also Read: Interim Budget 2024: మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ – కొత్త హౌసింగ్ పథకం ప్రకటించిన కేంద్రం, 300 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *