షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి రూ.7000 కోట్ల IPO, డబ్బు రెడీగా పెట్టుకోండి!

[ad_1]

Afcons Infra IPO: రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ‍‌(Shapoorji Pallonji Group) త్వరలో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, రూ. 7,000 కోట్ల భారీ సైజ్‌తో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రకటించబోతోంది. ఆఫ్కాన్స్ పబ్లిక్‌ ఇష్యూలో 1200 కోట్ల రూపాయల విలువైన తాజా షేర్లు ఉంటాయి. అలాగే, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి పెట్టొచ్చు.

ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐపీవోలో (Afcons Infrastructure IPO) షేర్లను విక్రయించడం ద్వారా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సుమారుగా రూ. 5750 కోట్లు ఆర్జిస్తుందని మార్కెట్‌ లెక్కలు వేసింది. ఈ కంపెనీలో గ్రూప్‌నకు 99.48 శాతం వాటా ఉంది. ఈ IPO కోసం ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రా మార్కెట్ విలువను దాదాపు రూ. 20 వేల కోట్లుగా లెక్క వేయవచ్చు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు తీసుకుంటుంది. వయాడక్ట్, ఫ్లైఓవర్, మెట్రో, బ్రిడ్జ్, పైప్‌లైన్, హైవే, పోర్ట్, బ్యారేజీ, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి అనేక భారీ ప్రాజెక్టులను కంపెనీ సమర్థవంతంగా పూర్తి చేసింది.

ఇటీవల రెండు పోర్టులు విక్రయం
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఇటీవలే రెండు పోర్టులను విక్రయించింది. వీటిలో ఒకటైన మహారాష్ట్రలోని ధర్మాతార్ పోర్టును రూ. 700 కోట్లకు జేఎస్‌హబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు (JSW Infrastructure Ltd) అమ్మింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఈ పోర్టును 2015లో కొనుగోలు చేసింది. దీని వార్షిక సామర్థ్యం 5 మిలియన్ టన్నులు. ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టును సుమారు రూ. 3,350 కోట్లకు అదానీ పోర్ట్ & సెజ్‌లకు ‍‌(Adani Ports) అప్పగించింది. 

పోర్ట్ వ్యాపారం నుంచి వైదొలగాలని, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి పెంచాలని నిర్ణయించినట్లు గతంలోనే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ప్రకటించింది. ఓడరేవుల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును రుణభారం తగ్గించడంతో పాటు, తన ప్రధాన వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకుంటుంది.

దేశంలోని పాతతరం బిజినెస్‌ గ్రూప్‌ల్లో ఒకటి
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, మన దేశంలో తొలి నుంచి ఉన్న వ్యాపార సమూహాల్లో ఒకటి. దీనిని 1865 సంవత్సరంలో స్థాపించారు. ఇంజనీరింగ్ & నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, నీరు, విద్యుత్‌, ఆర్థిక సేవల రంగాల్లో ఈ గ్రూప్‌ కంపెనీలు విస్తరించి, వ్యాపారం చేస్తున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ బెనిఫిట్స్‌ పొందడానికి చివరి అవకాశం, ఈ రోజు కాకపోతే ఎప్పటికీ కాకపోవచ్చు!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *