[ad_1]
Jio Fin Services – Blackrock Joint Venture: రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) మరో కొత్త బిజినెస్ ఆలోచనలో ఉంది. నూతన వ్యాపారం కోసం, అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్టర్ బ్లాక్‌రాక్ కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఈ రెండు కంపెనీలు కలిసి 50-50 శాతం వాటాతో జాయింట్ వెంచర్ (JV) ఏర్పాటు చేయనున్నాయి. ఈ JVలో.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ – బ్లాక్‌రాక్, బ్లాక్‌రాక్ అడ్వైజర్స్ సింగపూర్ పీటీఈ ఉంటాయి. జాయింట్ వెంచర్‌ను సోమవారం నాడు ప్రకటించారు.
సంపద నిర్వహణ, దళారీ పని
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ – బ్లాక్‌రాక్ కలిసి ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీ “వెల్త్ మేనేజ్‌మెంట్ & బ్రోకింగ్” కంపెనీగా పని చేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. JFSL వెల్లడించిన డేటా ప్రకారం, ఈ భాగస్వామ్యానికి 2023 జులై 26లోనే పునాది పడింది.
అసెట్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో మార్పు తీసుకువచ్చేలా, బలమైన ముద్ర వేసేలా ఈ జాయింట్ వెంచర్ పని చేస్తుంది. వినియోగదార్లకు పెట్టుబడికి సంబంధించిన విభిన్న పద్ధతులు అందించడానికి ప్రయత్నిస్తాం. ఇందుకోసం డిజిటల్ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెడతాం. సంపద నిర్వహణ, బ్రోకరేజ్ వ్యాపారం ప్రారంభించడానికి సెబీ ఆమోదం రావలసివుంది. – జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
నిన్న (సోమవారం, 15 ఏప్రిల్ 2024) జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ధర BSEలో దాదాపు 4.82 శాతం క్షీణించి రూ. 354.40 వద్ద ముగిసింది.
మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం ఎదురుచూపులు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ – బ్లాక్‌రాక్ కలిసి ఇప్పటికే ఒక జేవీని ఏర్పాటు చేశాయి, ఇది ఒక మ్యూచువల్ ఫండ్ (MF) కంపెనీ. దీనికి లైసెన్స్ కోసం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి గత ఏడాది అక్టోబర్‌లో దరఖాస్తు సమర్పించాయి. ప్రస్తుతం, సెబీ నుంచి అనుమతి కోసం ఈ జేవీ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో, బ్లాక్‌రాక్‌తో కలిసి మరో జేవీని ఏర్పాటు చేస్తుండడం విశేషం.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఆర్థిక సేవలు అందించే సంస్థ. గతంలో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అనుబంధ సంస్థగా ఉంది. గత ఏడాది ఆగస్టులో రిలయన్స్ నుంచి విడిపోయి, స్వతంత్ర సంస్థగా భారత స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది. బ్లాక్‌రాక్ ఇంక్ అనేది అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ కంపెనీ AUM సుమారు 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్’ Jio Fin, Cipla, Vi, Vedanta
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply