Home Remedies For Dry Cough: ఈ ఆయుర్వేద చిట్కాలతో.. పొడి దగ్గు త్వరగా తగ్గుతుంది..!

[ad_1]

Home Remedies For Dry Cough: చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మామూలే. పిల్లల నుంచి పెద్దవారి దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. చలిగాలులు, కాలుష్యం కారణంగా.. వివిధ అలర్జీలతో సహా జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు తరచుగా వేధిస్తుంటాయి. చాలా సందర్భాల్లో జలుబు, జ్వరం తగ్గినా.. దగ్గు వదిలిపెట్టదు. ముఖ్యంగా చాలామంది పొడిదగ్గుతో బాధపడుతూ ఉంటారు. పొడి దగ్గు సాధరణమైన సమస్యే కానీ, సాధారణ లైఫ్‌స్టైల్‌ను దెబ్బతీస్తుంది. రాత్రిపూట పొడి దగ్గు ఇంకా ఎక్కువగా ఉంటుంది, దీంతో నిద్ర దెబ్బతింటుంది. దగ్గు ఛాతీ నొప్పి ,గొంతు నొప్పిని కూడా కలిగిస్తుంది. చాలా మంది దగ్గు మందులు వాడుతున్నా పొడి దగ్గు నుంచి ఉపశమనం లభించదు. మీరు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి చౌకైన, ప్రభావవంతంగా ఉండే కొన్ని ఆయుర్వేద చిట్కాలు మనకు సహాయపడతాయి. పొడి దగ్గు, సాధారణ దగ్గు తగ్గడానికి ఆయుర్వేద డాక్టర్‌ కపిల్‌ త్యాగి (Dr. Kapil Tyagi, Director of Kapil Tyagi Ayurveda Clinic, E-260 Sector 27, Noida) కొన్ని హోమ్‌ రెమిడీస్‌ మనకు వివరించారు.

పొడిదగ్గుకు కారణాలు..

ఒత్తిడి, జలుబుగా ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్‌ వాడటం వల్ల కఫం ఎండిపోయి పొడి దగ్గు వస్తుందని డాక్టర్‌ కపిల్‌ త్యాగి అన్నారు. వాతావరణంలోని కాలుష్యం కారణంగానూ పొడి దగ్గు వస్తుందని తెలిపారు.

పసుపు, ఆవు నెయ్యి..

పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది వైరస్,బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గించటంలో సాయపడతాయి. పసుపులోని ఔషధ గుణాలు వాయునాళాలు, ఊపరితిత్తులలో పేరుకున్న కఫాన్ని కరిగిస్తాయి. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గు నుంచి ఉపశమనం ఇస్తాయి. మీరు పొయ్యి మీద.. బాణలి పెట్టి దానిలో దేశీ ఆవ నెయ్యి, పసుపు వేసి వేయించండి. అది వేగిన తర్వాత మంట ఆపి, అది చల్లారిని తర్వాత ఒక సీసాలో స్టోర్‌ చేసుకోండి. గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ ఈ మిశ్రమం కలిపి.. పాలలో వేసి ఉదయం, సాయంత్రం తీసుకుంటే. మీకు పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

తేనె, అల్లం..

మన శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయడానికి తేనె ఓ నేచురల్‌ యాంటీ బయాటిక్‌లా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దగ్గు, సాధారణ జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. మీ దగ్గు తగ్గాలంటే.. అల్లం రసం, సమాన పరిమాణంలో తేనె, నాలుగు తులసి ఆకుల పేస్ట్‌ పేసి కలపండి. దీన్ని ఉదయం, సాయంత్రం తీసుకోండి.

పిప్పలి, శొంఠి పొడి..

పిప్పలి, శొంఠి పొడి సమానంగా తీసుకుని కలపండి. దానిలో కొంచెం బెల్లం యాడ్‌ చేయండి. కొంచెం నెయ్యిలో 1-2 గ్రాముల పొడి కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే మీకు పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా.. పిప్పల పొడి, రాక్‌ సాల్ట్‌ సమాన పరిమాణంలో తీసుకుని.. గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి.

పసుపు..

ఒక బాణలిలో పసుపు వేసి.. గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి. దాన్ని ఒక సీసాలో స్టోర్‌ చేసుకోండి. అర టీస్పూన్‌ను పాలతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే.. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

త్రికాటు పొడి, బెల్లం..

త్రికాటు పొడి, బెల్లం సమాన పరిమాణంలో తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి. అంతే కాకుండా అర టీ స్పూను సీతోపాలాది చూర్ణాన్ని అల్లం రసంతో కలిపి రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. శ్లేష్మంతో కూడిన దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

వస, నెయ్యి..

ఇందుకోసం 15 మి.గ్రా వాస ఆకుల రసాన్ని, అంతే మోతాదులో ఆవు దేశీ నెయ్యి, సగం బెల్లం కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకోవాలి. ఇది తీసుకుంటే.. దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *