Flexi And Multi Cap Funds: ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ మ్యూచవల్ ఫండ్లలో ఏది బెటర్..?

[ad_1]

మల్టీ క్యాప్ ఫండ్స్

మల్టీ క్యాప్ ఫండ్స్

మల్టీ క్యాప్ ఫండ్‌లు కంపెనీ లేదా స్టాక్‌ల థీమ్‌తో సంబంధం లేకుండా, చిన్న కంపెనీలు, మధ్యస్థ కంపెనీలు, పెద్ద కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంటాయి. ఈ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ప్రయోజనాలు,స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ప్రయోజనాలు పొందడానికి పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఫండ్ మేనేజర్లు ప్రతి మార్కెట్ క్యాప్ స్టాక్‌లో మొత్తం ఫండ్‌లో కనీసం 25% పెట్టుబడి పెడతారు.

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్

ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌లు కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇందులో ఫండ్ మేనేజర్‌లు థీమ్‌తో సంబంధం లేకుండా మార్కెట్ క్యాప్ ఆధారంగా పెట్టుబడి పెడతారు. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో మొత్తం ఫండ్‌లో 65% అన్ని మార్కెట్ క్యాప్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి.

పెట్టుబడి నిష్పత్తి

పెట్టుబడి నిష్పత్తి

మల్టీ క్యాప్ ఫండ్ల విషయంలో, ఫండ్ మేనేజర్‌లు స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్లలో కనీసం 25% చొప్పున పెట్టుబడి పెట్టడానికి పరిమితి ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ విషయంలో అలాంటి పరిమితి లేదు. అయితే, కంపెనీల ఈక్విటీలో 65% పెట్టుబడి పెట్టాలి. అయితే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ఉన్న సమయంలో, పెద్ద కంపెనీలు బాగా పని చేస్తాయి. స్థిరమైన రాబడిని ఇస్తాయి.

తగినంత స్వేచ్ఛ

తగినంత స్వేచ్ఛ

ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినప్పుడు, చిన్న, మధ్యస్థ క్యాప్ ఫండ్‌లు లార్జ్ క్యాప్ ఫండ్ల కంటే మెరుగైన రాబడిని ఇస్తాయి. అటువంటి సందర్భంలో, ఫండ్స్ పరిమాణంపై విధించిన పరిమితులు కారణంగా మెరుగైన రాబడిని పొందలేరు.

ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ విషయంలో, ఫండ్ మేనేజర్‌కి మీ నిధులను మంచి రాబడిని పొందగల స్టాక్‌లలోకి మార్చడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ మల్టీక్యాప్ విషయంలో స్వేచ్ఛ లేదు.

రిస్క్

రిస్క్

ఎక్కువ రిస్క్‌లు తీసుకొని, ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ రాబడిని పొందాలనే వారికి మల్టీ-క్యాప్ ఫండ్‌లు మంచి ఎంపికలుగా ఉంటాయి. దీనికి విరుద్ధంగా, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకుంటే, స్థిరమైన రాబడిని పొందకూడదనుకుంటే, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు మీకు మంచి ఎంపిక కావచ్చు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *