INDvsBAN: వన్డేల్లో బెస్ట్ ప్లేయర్ కోహ్లీనే.. కాబోయే సెలక్టర్ కితాబు..!

[ad_1]

ఈ ఏడాది తిప్పలు..

ఈ ఏడాది తిప్పలు..

అయితే ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ లేక తిప్పలు పడిన అతను.. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదరగొడుతున్నాడు. ఆసియా కప్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. అనంతరం టీ20 వరల్డ్ కప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో ఈ ఏడాది కోహ్లీ సగటు అత్యంత దారుణంగా ఉంది. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అతని యావరేజ్ 21.88 మాత్రమే. బంగ్లాదేశ్‌తో వన్డేల్లో దీన్ని పెంచుకునేందుకు కోహ్లీకి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని బదానీ కూడా చెప్పాడు.

సెంచరీలు చేయడమే టార్గెట్..

సెంచరీలు చేయడమే టార్గెట్..

‘కోహ్లీ ఒక మెషీన్ వంటి వాడు. ప్రత్యర్థి బంగ్లాదేశా? లేదంటే పాకిస్తానా? ఆస్ట్రేలియానా? అనేది కోహ్లీకి అనవసరం. క్రీజులోకి దిగితే పరుగులు చేస్తాడంతే. తన బ్యాటింగ్‌ను నిర్మించుకుంటాడు. ఈ ఫార్మాట్ కోహ్లీ ఆటతీరుకు సరిగ్గా సరిపోతుంది. నా దృష్టిలో వన్డే క్రికెట్‌లో కోహ్లీనే బెస్ట్. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు’ అని తేల్చి చెప్పాడు. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్ చేయడమే కోహ్లీకి ఇష్టమన్న బదానీ.. సూర్య వంటి ఆటగాళ్లు తనతోపాటు ఉండటంతో ఇది అతనికి మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డాడు.

 కాబోయే సెలెక్టర్..

కాబోయే సెలెక్టర్..

సింపుల్‌గా సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి, సెంచరీలు చేస్తాడని తను భావిస్తున్నట్లు తెలిపాడు. ఇలా సెంచరీలు చేయడానికే కోహ్లీ ప్రయత్నిస్తాడని స్పష్టం చేశాడు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేయడంతో కొత్త వారిని నియమించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పదవుల కోసం హేమంగ్ బదానీ కూడా దరఖాస్తు చేసినట్లు వార్తలు వచ్చాయి. అవే నిజమైతే బదానీకి సెలెక్టర్ పదవి గ్యారంటీ అని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొంత వేచి చూడక తప్పదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *