ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – నేడు అరంగ్రేటం చేస్తున్న Dharmaj Crop Guard

[ad_1]

Stocks to watch today, 08 December 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 6.5 పాయింట్లు లేదా 0.03 శాతం రెడ్‌ కలర్‌లో 18,665 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ధర్మజ్ క్రాప్ గార్డ్: ప్రైమరీ మార్కెట్‌ నుంచి రూ. 251 కోట్లు సేకరించిన ఈ ఆగ్రో కెమికల్ కంపెనీ ఇవాళ (గురువారం, 08 డిసెంబర్‌ 2022) దలాల్ స్ట్రీట్‌లోకి అరంగేట్రం చేస్తోంది. నవంబర్ 28-30 తేదీల మధ్య జరిగిన IPOలో రూ. 216-237 రేంజ్‌లో షేర్లను అమ్మింది. ఈ ఇష్యూ 35.5 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

ఇన్ఫోసిస్: భారతదేశంలోని రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ రూ. 9,300 కోట్లతో నాలుగో దఫా షేర్ బై-బ్యాక్‌ను ప్రారంభించింది. ఓపెన్ మార్కెట్ మార్గంలో, రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు గరిష్టంగా రూ. 1,850 చెల్లించి వెనక్కు తీసుకుంటుంది.

News Reels

టెక్ మహీంద్రా: ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ పవర్డ్ ఎంటర్‌ప్రైజెస్ కోసం బిజినెస్‌ వాల్యూని పెంచడానికి, సమీకృత, సెక్టార్-ఆగ్నోస్టిక్ ప్లాట్‌ఫామ్ అయిన క్లౌడ్ బ్లేజ్‌టెక్‌ను ప్రారంభించినట్లు ఈ ఐటీ మేజర్ ప్రకటించింది. కంపెనీల డిజిటల్ ఫార్మేషన్‌ కోసం క్లౌడ్ సర్వీసుల్లో పెట్టుబడులను ఈ సంస్థ కొనసాగిస్తుంది.

ఐషర్ మోటార్స్: బ్రెజిల్‌లో తమ కొత్త అసెంబ్లింగ్ ఫెసిలిటీ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది. 

IDFC ఫస్ట్ బ్యాంక్: బ్యాంకింగ్ సొల్యూషన్ల ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి, స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఈ ప్రైవేట్ రంగ రుణదాత, NASSCOM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. బెంగళూరులోని స్టార్టప్‌ల కోసం ఈ బ్యాంకును ప్రాధాన్య బ్యాంకింగ్ పార్ట్‌నర్‌గా నియమిస్తూ IDFC ఫస్ట్, NASSCOM COE మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

మాక్రోటెక్ డెవలపర్స్‌: QIP ఆఫర్ ఫ్లోర్ ధరను ఒక్కో షేరుకు రూ. 1,022.75 గా ఈ రియల్టీ సంస్థ నిర్ణయించింది. ఈ ఫ్లోర్‌ ప్రైస్‌ మీద 5 శాతానికి మించకుండా డిస్కౌట్‌ను కంపెనీ, విక్రయించే వాటాదారులు ఆఫర్‌ చేయవచ్చు. ఈ ఆఫర్ ప్రయోజనం కోసం సంబంధిత తేదీగా డిసెంబర్ 7ను నిర్ణయించింది.

Aster DM హెల్త్‌కేర్: ఇరాక్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశంలోని ఫరూక్ మెడికల్ సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరాక్‌లోని క్లినికల్ స్టాఫ్, హెల్త్‌కేర్ నిపుణుల సామర్థ్య అభివృద్ధి, విద్య, వృత్తిపరమైన శిక్షణ 
కార్యక్రమాల కోసం సహకరించడానికి ఈ ఒప్పందం మీద సంతకం చేసింది.

మెట్రో బ్రాండ్స్‌: క్రావాటెక్స్ బ్రాండ్స్‌ కొనుగోలును ఈ ఫుట్‌వేర్ కంపెనీ 100 శాతం పూర్తి చేసింది. ‘FILA’, ‘Proline’ సహా వివిధ బ్రాండ్ల పాదరక్షలు, దుస్తులు, యాక్సెసరీస్‌ను దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, మార్కెటింగ్ చేయడం, ప్రకటనలు చేయడం, రిటైలింగ్ చేయడం, పంపిణీ చేయడం వంటి వ్యాపారాలను క్రావాటెక్స్ చేస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *