Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!

[ad_1]

అరవై రోజులే డెడ్‌ లైన్

అరవై రోజులే డెడ్‌ లైన్

సాధారణంగా అమెరికా వలస వెళ్లిన నిపుణులు H1B, L1 వీసాల ద్వారా పనిచేస్తుంటారు. ఏదైనా కారణాల వల్ల H1B వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోపు కొత్తది సాధించాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఇండియా తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం భారతీయ ఐటీ నిపుణులు ఇక్కడే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగ్గజ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. రెండు నెలల్లో కొత్త కొలువు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఉదాసీనంగా వ్యవహరించాలి:

ఉదాసీనంగా వ్యవహరించాలి:

అగ్రరాజ్యంలో సాంకేతిక నైపుణ్య లేమిని భర్తీ చేసేందుకుగాను.. ఇండియా, చైనా నుంచి ఏటా పదివేల మందిని అక్కడి టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటుంటాయి. కంపెనీలన్నీ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త కొలువు వెతుక్కోవడం సవాలుగా మారిందని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని.. H1B కార్మికుల పట్ల ఆయా కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. వారి తొలగింపు తేదీని కొంత కాలం పొడిగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

నిబంధనల పునః పరిశీలన అవసరం:

నిబంధనల పునః పరిశీలన అవసరం:

గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అనే సంస్థలు.. ఉద్యోగం కోల్పోయిన ఐటీ నిపుణులను రిక్రూటర్లతో కనెక్ట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అర్థం చేసుకుని.. బాధితులను ఆదుకునేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. తద్వారా ప్రతిభ కలిగిన నిపుణులను దేశంలో ఉంచుకోవడమూ లాభదాయకమేనని.. ఆ దిశగా ఆలోచించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పునః పరిశీలించాలని ప్రభుత్వానికి విఙప్తి చేస్తున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *