Google: ఉద్యోగుల తొలగింపు తర్వాత గూగుల్ మరో అడుగు.. ఏంటిది సుందర్ పిచాయ్..!

[ad_1]

తాజా నిర్ణయం..

తాజా నిర్ణయం..

ప్రస్తుతం సవాలుగా మారిన ఆర్థిక పరిస్థితుల్లో కంపెనీని ముందుకు నడిపేందుకు సుందర్ పిచాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం కంపెనీలో ఉద్యోగుల జీతాలను భారీగా తగ్గించవచ్చని తెలుస్తోంది. గూగుల్ ఉద్యోగులతో ఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో “సీనియర్ వైస్ ప్రెసిడెంట్” స్థాయికి మించిన అన్ని స్థానాలు వారి వార్షిక బోనస్‌లో పెద్ద తగ్గుదలని చూస్తాయని పిచాయ్ వెల్లడించారు.

కోతల వాతలు..

కోతల వాతలు..

వేతన కోతలు ఉంటాయని చెప్పకనే చెప్పిన పిచాయ్ అది ఎంత శాతం ఉంటుందనే వివరాలు వెల్లడించలేదు. ఈ కోతలు ఎంతకాలం అమలులో ఉంటాయనే విషయాన్ని సైతం ప్రకటించలేదు. గూగుల్ తొలగింపుల ప్రకటనకు ముందు సుందర్ పిచాయ్ గణనీయమైన వేతన పెంపును అందుకున్నారు. డబ్బు రూపంలో 84 మిలియన్ డాలర్ల వేతనంతో పాటు.. 63 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను కంపెనీ నుంచి అందుకున్నారు. Google CEO నికర విలువ 20% తగ్గి రూ. 5,300 కోట్లకు చేరుకుంది.

ఫిలిప్స్ లేఆఫ్స్..

ఫిలిప్స్ లేఆఫ్స్..

వైద్య పరికరాల తయారీ సంస్థ ఫిలిప్స్ ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను తొలగించింది. జనవరి 30న కంపెనీ తన నాల్గవ త్రైమాసిక ఫలితాలను నివేదించినప్పుడు.. కొత్త పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలగింపు ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది. ఫిలిప్స్ నెదర్లాండ్స్‌లోనే దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వార్తాపత్రిక ఐండ్‌హోవెన్స్ డాగ్‌బ్లాడ్ ప్రచురించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఇంటెల్ పతనం..

ఇంటెల్ పతనం..

ఇంటెల్ అమెరికాకు చెందిన అతిపెద్ద కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ. అయితే అనూహ్యంగా శుక్రవారం ఒక్కరోజే ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 8 బిలియన్ డాలర్ల మేర పతనమైంది. ఇంటెల్ 2023 మొదటి త్రైమాసికంలో నష్టాన్ని నమోదు చేస్తుందని అంచనాల మధ్య కంపెనీ షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే బల్ డేటా సెంటర్ వ్యాపారంలో వృద్ధి మందగించడమే దీనికి కారణమని ఇంటెల్ పేర్కొంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *